Advertisements

జాతీయస్థాయి ఖో ఖో జట్టుకు
ఎంపికైన నచ్చనేరి విద్యార్థిని

ఏర్పేడు ( నవంబర్ 21)… నచ్చనేరి విద్యార్థిని జాతీయస్థాయి ఖో ఖో జట్టుకు ఎంపికయింది బంగారుపాళ్యంలో జరిగిన 67వ స్కూల్ గేమ్స్ రాష్ట్రస్థాయి ఖో ఖో పోటీలు ఈ నెల 19- 11 -2023 నుండి 21-11-2023 వరకు జి హెచ్ ఎస్ బంగారుపాలెం లో నిర్వహించారు.
ఈ పోటీలలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల  పంగురు విద్యార్థులు రాష్ట్రస్థాయి బాలురు విభాగంలో జి. లక్ష్మీప్రసాద్, బి .చక్రినాద్ 8వ తరగతి విద్యార్థులు జట్టు విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించి విజేతలుగా నిలిచారు . బాలికల విభాగంలో సి .అమృత ,ఎం. అర్చన రెడ్డి విద్యార్థిని రాష్ట్రస్థాయి ఖో ఖో పోటీలో విజేతగా నిలిచారు.నచ్చనేరు గ్రామానికి చెందిన సి. జగన్నాథం రెడ్డి కుమార్తె  అమృత 7వ తరగతి జాతీయస్థాయి ఖో ఖో జట్టు కు ఎంపికయింది  . ఈ పోటీలను ఝార్ఖండ్ రాష్ట్రంలోని రాంచీలో నిర్వహిస్తారు.విజేతలగా నిలిచిన విద్యార్థులను,  వ్యాయామ ఉపాధ్యాయుడైన ఎస్ .లోకేష్ ను జీవి. ప్రసాద్ రెడ్డిప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయ బృందం , గ్రామ ప్రజలు అంకిత భావాన్ని కొనియాడారు.

Leave a Comment