Advertisements

సకాలంలో కమాండ్ కంట్రోల్ సెంటర్ పనులు పూర్తి చేయండి.

సకాలంలో కమాండ్ కంట్రోల్ సెంటర్ పనులు పూర్తి చేయండి.

స్మార్ట్ సిటీ ఎం.డి. హరిత ఐఏఎస్

నగరంలో అత్యాధునిక సాంకేతక పరిజ్ఞానంతో ఏర్పాటు చేస్తున్న ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పనులను సకాలంలో పూర్తి చేయాలని తిరుపతి స్మార్ట్ సిటీ మేనేజింగ్ డైరెక్టర్, తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ హరిత ఐఏఎస్ అధికారులను, కాంట్రాక్ట్ నిర్వాహకులను ఆదేశించారు. కమాండ్ కంట్రోల్ సెంటర్ పనుల పురోగతిపై నగరపాలక సంస్థ సమావేశ మందిరంలో ఇంజినీరింగ్, ఏఈకామ్, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కాంట్రాక్టు ప్రతినిధులతో మంగళవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ హరిత మాట్లాడుతూ అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఏర్పాటు చేస్తున్న ఈ సెంటర్ ద్వారా ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. అధికారులు, నిర్మాణ నిర్వాహకులు సమన్వయం చేసుకుని పనులు వేగంగా పూర్తి చేయాలని అన్నారు. ఇచ్చిన గడువులోపు పనులు చేయకుండా ఆలస్యం చేస్తున్నారని అన్నారు. పనుల్లో జాప్యం జరగకుండా అనుకున్న మేర పనుల పూర్తి చేయాలన్నారు. ఈ కేంద్రం ద్వారా నగరంలో భద్రత మరింత పెరుగుతుందని, నగరంలో ఏ మూల ఏమి జరిగినా క్షణాల్లో తెలిసే విధంగా సెంటర్ పనిచేస్తుందన్నారు. అలాగే వాహనాల రాకపోకల నియంత్రణ, నగరంలో కాలుష్య నియంత్రణ, యూజర్ చార్జీల వసూళ్లు, అపరాధ రుసుము విధింపు వంటి కార్యక్రమాలు ఈ సెంటర్ ద్వారానే సాగుతుందన్నారు. ఈ సమావేశంలో సూపరింటెండెంట్ ఇంజినీర్ మోహన్, స్మార్ట్ సిటీ జి.ఎం. చంద్రమౌళి, ఏఈకామ్ ప్రతినిధి బాలాజీ, కాంట్రాక్టు సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు.

Leave a Comment