Advertisements

బీగాల. దీక్షిత్ పుట్టినరోజు సందర్భంగా35 మంది దివ్యాంగులు వృద్ధులు కొరకు భోజనం ఏర్పాటు

ఏర్పేడు ( నవంబర్ 21)… దివ్యాంగుల పట్ల దాతృత్వం… ఏర్పేడు మండలం ,వికృతి మాల గ్రామం సమీపంలోని నీలాద్రి నిలయంలో శ్రీ లక్ష్మీనరసింహ చారిటబుల్ ట్రస్ట్ నిర్వహిస్తున్న దివ్యాంగుల వృద్ధుల క్షేత్రంలో నిర్వహిస్తున్న వృద్ధాశ్రమంలో మంగళవారం తిరుపతికి చెందిన బీగాల. రమేష్ కుమారుడు బీగాల. దీక్షిత్ పుట్టినరోజు సందర్భంగా దివ్యాంగులకు స్వీట్లు పంపిణీ చేసి కేక్ కట్ చేసి పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. 35 మంది దివ్యాంగులు వృద్ధులు కొరకు భోజనం ఏర్పాటు చేసి వారి పట్ల సేవా కార్యక్రమాలు నిర్వహించారు.  పుట్టినరోజు వేడుకలు ఇక్కడ జరుపుకోవడం తమక ఎంతో ఆనందదాయకమని వృద్ధాశ్రమ నిర్వాహకులు  తెలిపారు. ఈ సందర్భంగా శ్రీ లక్ష్మీ చారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకురాలు సైదమ్మ మాట్లాడుతూ దాతలు సహాయ సహకారాలు తోనే ఈ కేంద్రం నిర్వహిస్తున్నామని వారి సంరక్షణ కొరకు ఎంతోమంది దాతలు తమ వంతు సహాయ సహకారాలు అందిస్తున్నారని తెలిపారు భవిష్యత్తులో మరి కొంతమంది దాతలు ముందుకు రావాలని కోరారు .ఈ కేంద్రం నడుపుటలో సహాయ సహకారాలు అందిస్తున్న వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు.

Leave a Comment