Advertisements

భవిష్యత్తు గ్యారంటీ
జనసేన విజయ యాత్ర – AP NEEDS PAWAN KALYAN

9 వ రోజు శ్రీకాళహస్తిలో జనసేన ఇంటింటికీ ప్రచారం

జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ – టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు   ఆదేశాల మేరకు
భవిష్యత్తు గ్యారంటీ పేరుతో ఉమ్మడి మినీ మానిఫెస్టో ను శ్రీకాళహస్తి నియోజకవర్గ జనసేన పార్టీ ఇంఛార్జి శ్రీమతి వినుత కోటా తొట్టంబేడు మండలం ఇలగనూరు హరిజనవాడ లో ఇంటింటికీ ప్రచారం నిర్వహించి ఉమ్మడి మినీ మానిఫెస్టో ను వివరించడం జరిగింది. మరియు ప్రజలకు వైసీపీ ప్రభుత్వం చేస్తున్న అవినీతి,అక్రమాలను , దోపిడీలను వివరించడం జరిగింది. రానున్న ఎన్నికల్లో జనసేన – టీడీపీ ఉమ్మడి ప్రభుత్వంను ఆశీర్వదించాలని కోరడం జరిగింది.
గ్రామంలో రోడ్లు అధ్వాన స్థితిలో ఉందని, డ్రైనేజ్ కాలువలు అస్సలు లేక ఇబ్బందులు పడుతున్నట్టు సమస్యలు తెలిపారు. ప్రభుత్వం వచ్చిన 3-6 నెలల్లో సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇవ్వడం జరిగింది.

ఈ కార్యక్రమంలో తొట్టంబేడు మండల మండల అధ్యక్షులు కొప్పల గోపి, ప్రధాన కార్యదర్శి పేట చంద్ర శేఖర్ , ఐటీ కోఆర్డినేటర్ కావలి శివకుమార్, నాయకులు తోట గణేష్, పేట చిరంజీవి, శారద, కవిత, లక్ష్మి, బత్తెమ్మ , రవి కుమార్ రెడ్డి, నితీష్, జ్యోతి రామ్, రాజేష్, సురేష్, గురవయ్య, హేమంత్ , దినేష్, జనసైనికులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Comment