Advertisements

IND Vs AUS T20 Series:

IND Vs AUS T20 Series: నవంబర్ 23 నుంచి భారత్-ఆస్ట్రేలియా మధ్య టీ20 సిరీస్.. పూర్తి షెడ్యూల్, జట్ల వివరాలు..*స్వదేశంలో ఆస్ట్రేలియాతో నవంబర్ 23 నుంచి టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. ఇందుకోసం భారత జట్టును బీసీసీఐ తాజాగా ప్రకటించింది. సూర్యకుమార్ యాదవ్‌కు కెప్టెన్సీ, రుతురాజ్ గైక్వాడ్‌కు వైస్ కెప్టెన్‌గా బాధ్యతలు అప్పగించారు.నవంబర్ 23 నుంచి విశాఖపట్నంలో ఆస్ట్రేలియాతో జరగనున్న ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు బీసీసీఐ భారత జట్టును ప్రకటించింది. *తొలి మూడు టీ20 మ్యాచ్‌లకు రుతురాజ్ గైక్వాడ్ వైస్ కెప్టెన్‌గా ఉండగా, సూర్యకుమార్ యాదవ్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించనున్నారు*. కాగా, శ్రేయాస్ అయ్యర్ వైస్ కెప్టెన్‌గా నాలుగో, ఐదో టీ20లకు జట్టులో చేరనున్నాడు. ఈ సిరీస్‌కు ఆస్ట్రేలియా సైతం జట్టును ప్రకటించింది. ఆస్ట్రేలియా జట్టు కెప్టెన్‌గా మాథ్యూ వేడ్ వ్యవహరించనున్నారు. కాగా, నవంబర్ 23 నుంచి ప్రారంభమయ్యే *టీ20 సిరీస్ వైజాగ్, త్రివేండ్రం, గౌహతి, నాగ్‌పూర్, హైదరాబాద్‌లోని ఐదు వేదికలపై జరగనుంది*. విశాఖపట్నంలో ఆతిథ్య ఆస్ట్రేలియాతో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ గురువారం (నవంబర్ 23) ప్రారంభమవుతుంది.

Leave a Comment

You May Like This