Advertisements

పేదల పక్షపాతి ,ఇచ్చిన మాట నెరవేర్చే గొప్ప వ్యక్తి సీఎం.జగన్ మోహన్ రెడ్డి- ఎమ్మెల్సీ

తిరుపతి జిల్లా (20.11.2023 చిట్టమూరు  మండలం గుణపాడు  గ్రామంలో ఆంధ్రాకి జగనే సీఎం గా ఎందుకు కావాలి అనే కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఎమ్మెల్సీ.మేరిగా మురళీ ధర్ కి  గ్రామ ప్రజలు నాయకులు పూల గుచ్ఛం అంధించి శలావలతో కప్పి ఘనంగా సన్మానించారు .మొదటి గా గ్రామంలో ఉన్న  రాజశేఖర్ రెడ్డి  విగ్రహానికి ఎమ్మెల్సీ మేరీగా మురళీధర్ పూలమాలలో వేసి నివాళులర్పించారు .

కార్యక్రమంలో భాగంగా  ఏర్పాటు చేసిన డిస్ప్లే బోర్డును , వైఎస్సార్సీపీ జెండాను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్సీ  మాట్లాడుతూ  ఆంధ్ర రాష్ట్రంలో సీఎం జగన్మోహన్ రెడ్డి అందించిన పరిపాలను ఆదర్శంగా  తీసుకొని పక్క రాష్ట్రా కు మార్గదర్శ గా నిలిచారన్నారు.నవరత్నాల పేరుతో ఎన్నో పథకాలును ప్రజలకు అందించి అమలు పరిచిన ఏకైక నాయకుడు, పేదల పక్షపాతి ,ఇచ్చిన మాట నెరవేర్చే గొప్ప వ్యక్తిని ఎమ్మెల్సీ అన్నారు.


ఆరోజు పాదయాత్రలో ప్రజల కష్టాలను చూసిన సీఎం జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం  సంక్షేమం అభివృద్ధ కి పెద్దపీట వేస్తూ ప్రజల వద్దకే పరిపాలను తీసుకొచ్చి ,అమలుపరిచిన పథకాల్లో  ప్రతి కుటుంబానికి అందించే విధంగా, మధ్యవర్తి లేకుండా నేరుగా అర్హులైన వారికి లబ్ధి పొందే విధంగా పరిపాలనందించిన ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఒక్కరే అన్నారు.ఇంత గొప్పగా సుపరి పరిపాలన అందించిన సీఎం జగన్మోహన్ రెడ్డి ని రాబోయే ఎలక్షన్లలో తప్పకుండా మరోసారి సీఎం గా ప్రజలు గెలిపించుకోవాలని,  ఇంతకన్నా గొప్ప అభివృద్ధి చూడాలంటే  ఆ గొప్ప వ్యక్తిని మనం గెలిపించుకునే బాధ్యత మనకు ఉందని ప్రజలను కోరెరు. సూళ్లూరుపేట లో జరుగుతున్న సీఎం జగన్మోహన్ రెడ్డి మహాసభకు నియోజకవర్గ ప్రజలు తరలివచ్చి జయప్రదం చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రభుత్వ అధికారులు తదితరులు పాల్గొన్నారు
 

Leave a Comment