అంతర్జాతీయ బాలల హక్కుల పరిరక్షణ ఉత్సవాలలో భాగంగా ప్రగతి స్వచ్ఛంద సేవా సంస్థ తిరుపతి బెంగళూరు వారి సహాయ సకహారాలతో ఏర్పేడు మండలం బండారుపల్లి హైస్కూలలో అంతర్జాతీయ బాలల హక్కుల పరిరక్షణ వారోత్సవాలు జరిగాయి ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మండల విద్యాశాఖ అధికారి దయాకర్ రావు
మాట్లాడుతూ విద్యార్థులు బాలల హక్కులను ఉద్దేశించి మాట్లాడుతూ బాలలందరూ బాలల హక్కులను వినియోగించుకుంటూ బాగా చదువుకొని ఉన్నత స్థాయికి ఎదగాలని పాఠశాలకు ఉపాధ్యాయులకు తల్లిదండ్రులకు సమాజానికి మంచి పేరు తీసుకురావాలని మాట్లాడారు ప్రధాన ఉపాధ్యాయులు నిర్మల్ కుమార్ బాలల హక్కులు పరిరక్షణ అందరూ బాధ్యత నేటి బాలలే రేపటి పౌరులు అని పిల్లలకు మంచి మాటలు చెప్పడం జరిగింది .
ఈ కార్యక్రమంలో ఏర్పేడు పీహెచ్సీ సిబ్బంది బండారుపల్లి గ్రామ సచివాలయ సిబ్బంది ఎమ్మెస్ కే ప్రగతి ఎం సి ఓ శిరీష గారు వెంకటేష్, సురేష్ తదితరులు పాల్గొన్నారు బాలల దినోత్సవం బాలల హక్కుల పరిరక్షణ వారోత్సవాలు సందర్భంగా ప్రగతి క్రై సంస్థ వ్యాసరచ, చిత్రలేఖన, వకృత్వము, మ్యూజికల్ చైర్స్,రన్నింగ్ రేస్ వంటి వీవెంట్స్ జరిపి బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమనిర్వహణలో రామచంద్ర,సుబ్రమణ్యం మొదలగు ఉపాధ్యాయులు పాల్గొనడం జరిగిందీ