తిరుపతి జిల్లా..కోట మండలం
మద్యం మత్తులో కుమారుడిని తండ్రి బండ రాయితో కొట్టి హత్య చేసిన ఘటన కోట మండలం విద్యానగర్లో ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. తండ్రి, కొడుకులు ఇద్దరు మద్యానికి బానిసై మద్యం విషయంలో తరచూ గొడవలు పడుతూ ఉండేవారు. ఈ క్రమంలో మద్యం కోసం డబ్బులు ఇవ్వలేదని వారిద్దరూ గొడవ పడ్డారు. పోలీసులు చేరుకునేసరికి మృతుని తండ్రి రక్తపు మరకలను శుద్ధి చేస్తూ కనిపించడంతో పోలీసులు అతనిని అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు.