గూడూరు పట్టణం గాంధీనగర్ సమీపంలో ఓ యువతి , యువకుడు రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డారు.. ఈ సంఘటన ఆదివారం చోటు చేసుకుంది..మృతులు పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన రాకేష్ , గుంటూరుకు చెందిన పావని గా రైల్వే పోలీసులు గుర్తించారు..ఇద్దరూ కలిసి ఒకే చోట బలవన్మరణానికి పాల్పడినట్లు రైల్వే పోలీసులు వెల్లడించారు..మృత దేహాలను పోస్టు మార్టం నిమిత్తం గూడూరు ఏరియా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు…కేసు నమోదు చేసుకుని ఆత్మహత్యకు గల కారణాలపై రైల్వే పోలీసులు విచారణ చేపట్టారు.