తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలో
తెలుగుదేశం – జనసేన ఉమ్మడి సారథ్యంలో గుంతల ఆంధ్రప్రదేశ్ కి దారేది అనే కార్యక్రమంలో భాగంగా.గూడూరు టౌన్ నుండి వెంకటగిరి వెళ్లే మినీ బైపాస్ రోడ్డు నందున్న గుంతలలో నాయకులు మరియు కార్యకర్తలతో కలసి బైటాయించి నిరసన తెలపారు.
ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే పాశిం సునిల్ కుమార్ మాట్లాడుతూఈ ప్రభుత్వ పాలనలో ఒక్కఛాన్స్ అని కళ్ళ బొల్లి మాటలు చెప్పి అధికారంలోకి వచ్చి 4 సంవత్సరాలు పైన అవుతున్నావచ్చినప్పటి నుండి కూల్చడం తప్ప నిర్మించడం,బాగుచేయడం తెలియదు ఈ ప్రభుత్వానికి.తెలియదన్నారురాష్ట్రంలో రోడ్ల లో గుంతలు గా లేవని గుంతలలో రోడ్లు ఉన్నాయని అన్నారు.ఈ రోజు మేము జనసేన కలసి నియోజకవర్గంలో అద్వానంగా ఉన్న రోడ్ల పై మేమందరం కలసి పోరాడుతున్నాం అని అన్నారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి నెలబల్లి భాస్కర్ రెడ్డి,పట్టణ పార్టీ అద్యక్షులు పులిమి శ్రీనివాసరావు, జిల్లా అధికార ప్రతినిధి బిల్లు చెంచు రామయ్య,పార్లమెంట్ క్రిస్టియన్ సెల్ అద్యక్షులు ఇస్రాయెల్ కుమార్,నియోజకవర్గ మైనారిటీ అద్యక్షులు MD అబ్దుల్ రహీం, ఆరికట్ల మస్తాన్ నాయుడు,వాటంబేటీ శివ కుమార్,మహిళలు గుండాల లీలావతి,మట్టం శ్రావని రెడ్డి,గుండాల శ్రీదేవి,కీర్తిపాటి సుధ,యువత నాయకులు కార్యకర్తలు తదితరులు అధిక సంఖ్యలో మరియు జనసేన నియోజకవర్గ ఇంచార్జ్ తీగల చంద్ర శేఖర్,TDP-JSP సమన్వయ POC మోహన్,పట్టణ పార్టీ అద్యక్షులు ఇంద్రవర్ధన్ జనసేన నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.