19- నవంబర్- గూడూరు
డోర్ టు డోర్ సర్వే చేయాలి అధికారుల నిర్లక్ష్యం వ్యవహరిస్తే సహించను సబ్ కలెక్టర్ కార్యాలయంలో తాసిల్దారులు బూతు లెవెల్ ఆఫీసర్ తో డ్రాఫ్ట్ ఓటర్ లిస్ట్ పై సమీక్ష సమావేశం గూడూరు పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆర్టీవో కిరణ్ కుమార్ అధికారులు మరియు సిబ్బందికి పలు సూచనలు అందజేశారు .ఈ సమావేశంలో తాసిల్దారులు బూతు లెవెల్ ఆఫీసులతో ఓటర్ లిస్టుపై సమీక్ష కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ఎన్నికల కమిషన్ రూపొందించిన డ్రాఫ్ట్ ఓటర్ లిస్టులో ఉన్న తప్పులను సరి చేసేందుకు డోర్ టు డోర్ సర్వే నిర్వహిస్తున్నామని ఫామ్ నెంబర్ 6 మరియు 7 వినియోగంపై క్షుణ్ణంగా పరిశీలించాలని అధికారులు మరియు సిబ్బందికి సూచించడం జరిగిందని తెలిపారు . డ్రాఫ్ట్ ఓటర్ లిస్టులో సవరణలు వీలైనంత త్వరగా పారదర్శకంగా పూర్తి చేయాలని తెలియజేశారు