ఏర్పేడు (నవంబర్ 16)… పాపానాయుడుపేటలో కేంద్ర ప్రభుత్వ శాఖలో నూతనంగా నియమితులైన సెంట్రల్ సెక్రటేరియట్ సర్వీస్ (సీఎస్ఎస్) ఉద్యోగులు అంజూ తన్వార్, అనీషా జైన్, దివ్యాన్షి త్రిపాఠి, సునీల్ కుమార్ మీనా, ప్రియాంక మీనా, అరవింద్ కుమార్ కర్వా తో కూడిన బృందం గురువారం పాపానాయుడుపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సందర్శించారు. భారత్ దర్శన్ భాగంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలుఅందిస్తున్న వివిధ రకాల సేవల గురించి, , మహిళా సంరక్షణ బయట నుంచి వచ్చే రోగులు రిజిస్ట్రేషన్ డాక్టర్ కన్సల్టేషన్ ల్యాబ్ ఫార్మసీ డెలివరీ ఇన్ పేషెంట్ తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు.ఈ క్రమంలో వైద్యాధికారి ఈ మధురిమ ,సిహెచ్ఓ లలిత, పర్యవేక్షణ సిబ్బంది ఎం. సుబ్రహ్మణ్యం, కే .మంజుల, ఫార్మసిస్టు నాగభూషణం, స్టాఫ్ నర్స్ ఢిల్లీశాలిని, పంచాయతీ కార్యదర్శి యం.హరికృష్ణ , డీఎల్పీఓ బి. ప్రభురెడ్డి, జూనియర్ ఫ్యాకల్టీ సిహెచ్. బాల వసుధర్, పాల్గొన్నారు. అలాగే ఆరోగ్య కేంద్రంలో పైన తెలియజేసిన బృందంలో ఒకరు వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఈ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సేవలు బాగున్నాయని కితాబు పలికారు.