తిరుపతి జిల్లా (09.10.2023) గూడూరు రూరల్ మండలం తిప్పవరప్పాడు గ్రామంలో నిర్వహించిన ఆంధ్రాకి జగనే ఎందుకు కావాలి కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన శాసనసభ్యులు వెలగపల్లి వరప్రసాద్ రావు . రైతు భరోసా కేంద్రంలో ఏర్పాటు చేసిన డిస్ప్లే బోర్డును ఆవిష్కరించారు, అనంతరం ఊరిలో ఏర్పాటుచేసిన వైఎస్సార్సీపీ జెండాను ఆవిష్కరించారు…సభలో ఉన్న ఎమ్మెల్యే దృష్టికి స్థానిక నాయకులైన పలువురు తమ గ్రామ సమస్యలను తెలుపగా అందులో డేగపూడి కృష్ణారెడ్డి తమ గ్రామంలో రైస్ బండి రావడం లేదని రెండు నెలల నుండి రైస్ వేసే అతను లేడని మా ఊరిలో ఎవ్వరికి రైస్ ఇవ్వడం లేదు పేదవారు చాలా ఇబ్బందులకు గురవుతున్నారని తెలపడంతో వెంటనే స్పందించి ఎంపీడీఓ తో మాట్లాడి రేపే ఆ గ్రామంలో రైస్ బండి రావాలని పేదవారందరికీ బియ్యం అందజేయాలని ఆదేశించారు,,, రెండోవదిగా గ్రామంలోని చెరువు నుండి పంట కాలువలకు నీరు వెళ్లడానికి కాంక్రీట్ గోడలు నిర్మించాలని కోరడంతో వాటికి రేపే ప్రతిపాదనలు పంపే విధంగా ఇరిగేషన్ వారితో మాట్లాడి చేస్తామని భరోసా ఇవ్వడంతో కృష్ణారెడ్డి గ్రామస్తులు తరఫున కృతజ్ఞతల ఎమ్మెల్యే గారికి తెలిపారు… అదేవిధంగా కొండూరు సునీల్ రెడ్డి రెండు సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు, మొదటిగా తమ గ్రామంలోని పలువురు సీఎం సహాయనిధి పెట్టుకోవడం జరిగింది కొన్ని అనివార్య కారణాలతో రాలేదని వాటిని ప్రభుత్వం ద్వారా ఇప్పించాలని కోరడంతో ఎవరైతే అప్లై చేసుకున్నారో వారి యొక్క లిస్టు పంపించండి వారికి సీఎం సహాయనిది ఇచ్చే విధంగా సీఎం గారిని కోరుతానని ఎమ్మెల్యే హామీ ఇవ్వడం జరిగింది. రెండోవది తమ గ్రామంలో వాటర్ ట్యాంక్ లేదని గ్రామస్తులు ఇబ్బంది పడుతున్నారని గ్రామస్థుల తరపున వాటర్ ట్యాంక్ కట్టించమని ఎమ్మెల్యే కోరడంతో అధికారులతో మాట్లాడి వాటర్ ట్యాంక్ ఏర్పాటు చెయ్యడానికి ప్రతిపాదనలు సిద్ధం చేసి ట్యాంక్ ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు..,స్థానిక సర్పంచ్ భర్త ఇట్లివల మరణించారని తెలియడంతో ఆమెకు ఆర్థిక సహాయం అందజేసి వైసిపి నాయకులు అందరూ మీ వెంట ఉన్నామని భరోసా ఇచ్చారు… స్థానికులు పలువురు తమ సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకురావడంతో వారి సమస్యల పరిష్కారానికి తగు చర్యలు తీసుకుంటానని భరోసా ఇవ్వడంతో స్థానికులు హర్షం వ్యక్తపరిచారు.., ఈ కార్యక్రమంలో మండలం జడ్పిటిసి స్థానిక వైసీపీ పార్టీ నాయకులు మండల నాయకులు కార్యకర్తలు అభిమానులు సచివాలయం కన్వీనర్లు గృహ సారథులు ఎంపీటీసీలు సర్పంచులు సచివాలయం సిబ్బంది వాలంట్రిలు పాల్గొన్నారు..,*_