
తిరుపతి జిల్లా గూడూరు- రూరల్ ఎస్ ఐ
ఎం.మనోజ్ కుమార్ స్థానిక మీడియా తో మాట్లాడుతూ ముందస్తుగా రూరల్ ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు.దీపావళి విశిష్టత తెలియజేస్తూ నరకాసురుడనే రాక్షసుడిని సంహరించిన మరుసటి రోజు అతడి పీడ వదిలిన ఆనందంలో ప్రజలు దీపావళి చేసుకుంటారని , చెడుపై మంచి సాధించిన రోజుని విజయానికి గుర్తుగా జరుపుకునే పండుగని ఇంట్లోని ప్రతికూల శక్తులను తొలగించి. నూతన వెలుగులు తీసుకొచ్చే గొప్ప పండుగాజరుపు కుంటారని గుర్తు చేసారు. గ్రామాల్లో గడ్డి వాములు,పురిల్లు ఉండే అవకాశం ఉందందున బాణాసంచాలు కాల్చేటప్పుడు జాగ్రత్తలు పాటించలని సూసించారు. వాటికి దూరంగా కాల్చుకోవడం వల్ల ప్రమాదాలు జరగకుండా నివరించావచ్చు అన్నారు. టపాకాయలు వల్ల అత్యధికంగా పొగ రావడం జరుగుతుందని దాన్ని పీల్చకుండా మాస్కులు ధరించడం మంచిదన్నారు. పిల్లలు టపాకాయలు కాల్చేటప్పుడు తల్లిదండ్రులు పరిశీలిస్తూ ఉండాలని సూచించారు. అగ్ని ప్ర మాదం సంభవిస్తే ఫైర్ స్టేషన్కు 101, పోలీసులకు 100 లేదా 112కి ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలన్నారు.