తిరుపతి జిల్లా గూడూరు సబ్ కలెక్టరేట్ కార్యాలయంలో ఆర్ డి ఓ. ఎం.కిరణ్ కుమార్, DSP .సూర్య నారాయణరెడ్డి , తహశీల్దార్ బాలలీలా రాణి వల్నరబిలిటీ మ్యాపింగ్ పై సమీక్ష సమావేశం నిర్వహించారు.
జరగబోవు 2024 సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి. ఆర్ డి ఓ. ఎం కిరణ్ కుమార్, పోలీసు శాఖ , రెవిన్యూ శాఖ తో సమన్యవయం తో సమీక్ష సమావేశంలో సమీక్షించారు.
ఈ సందర్భంగా గూడూరు రెవిన్యూ డిజినల్ అధికారి ఎం .కిరణ్ కుమార్ మాట్లాడుతూ ,ఎన్నికల కమిషనర్ ఆదేశాలు మేరకు వల్నరబిలిటీ మ్యాపింగ్
పై ఎన్నికల కమిషనర్ రిపోర్ట్ కోరడంతో
వల్నరబిలిటీ మ్యాపింగ్ పై చర్చించమన్నారు
ఆర్ డి ఓ తెలియజేస్తూ జరగబోయే ఎన్నికల్లో ఆయా పోలీసు స్టేషన్ పరిధిలో ఉన్నా దుర్బలత్వానికి కారణమయ్యే వ్యక్తులును ప్రాంతంలను గుర్తిచడం.
న్యాయమైన పద్ధతిలో ఓటు హక్కును వినియోగించుకోవాడికి, ఓటర్లును నగదు , లంచం ,బెదిరింపులతో ప్రభావితం చేసే వ్యకలును గుర్తిచడం , సమస్యాత్మక గల , హానికలిగించే , ఓటర్ల విభాగాన్ని ముందుగానే గుర్తించి , అటువంటి దుర్బలత్వానికి కారణమయ్యే వ్యక్తులు లేదా ఇతర కారకాలపై తగిన దిద్దుబాటు చర్యలను ముందుగానే తీసుకోవడం వట్టి అంశాలపై ఈ సమావేశంలో సమీక్షించామని అన్నారు.
పోలింగ్ సెంటర్లో ఓటర్లు స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా తమ ఓటును వినియోగించడానికి వల్నరబిలిటీ మ్యాపింగ్ పై అవగాహన కల్పిస్తూ ,ఎన్నికలు ప్రశాంతంగా జరుగుటకు తగిన చర్యలు చేపడుతుమన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ పోలీస్ శాఖ అధికారులు, రెవెన్యూ శాఖ అధికారులు, తహశీల్దార్ర్లు, ఎస్ హెచ్ వో లు తదితరులు పాల్గొన్నారు