Advertisements

ఆర్ సి ముసుగులో దందాలు చేస్తున్న మహిళపై కఠిన చర్యలు తీసుకోవాలి.

బాధితులకు న్యాయం చేయాలి.. నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్..

భార్య భర్తల తాగాదా కేసులో యు పి హెచ్ ఆర్ సి మహిళ నాయకులు పై చర్యలు తీసుకొని బాధితులకు న్యాయం చేయాలని నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ చైర్మన్ డాక్టర్ పి సంపత్ కుమార్ అన్నారు. శనివారం ఎస్ బీ టీ హోటల్ లో జరిగిన పత్రికా విలేకరుల సమావేశంలో నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ చైర్మన్ సంపత్ కుమార్ మాట్లాడుతూ మాయమాటలతో కోమలి దేవి బాధితుడు శ్రీధర్ కుటుంబం దగ్గర నుంచి బంగారాన్ని తీసుకొని బాధితులు తిరిగి బంగారం అడిగేసరికి ఆత్మహత్యకు ప్రేరేపించారని, శ్రీధర్, నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ పై అసత్య ప్రచారాలు చేస్తున్న యు పి హెచ్ ఆర్ సి ముసుగులో దందాలు చేస్తున్న మహిళపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ఆత్మహత్య ప్రేరణ వెనుక అసలు వ్యక్తి ఎవరో తెలియాలి అంటే ఆమెకు నిబంధన లకు విరుద్దంగా నిద్రమాత్రాలు ఇచ్చిన మెడికల్ షాప్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని, నిద్ర మాత్రలు తీసుకున్న వారిని విచారిస్తే ఆమె ఏ షాపులో కొనుగోలుచేసిందో దాని బ్యాచ్ నంబరు, వివరాలు మందులు అమ్మిన తీరు ప్రిస్కిషన్, వివరాలు, ఎంక్వయిరీ చెయ్యా లని డ్రగ్ కంట్రోల్ ఆధారిటికి నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ డిమాండ్ చేస్తుందన్నారు. ఈ విషయంపై తక్షణమే పోలీసులు స్పందించి మాయమాటలతో బురిడీ కొట్టించిన వారిని పట్టుక అని బాధితులకు న్యాయం చేయవలసిందిగా ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ నేషనల్ లీగల్ కార్యదర్శి కాండ్రేంగుల లీలా హరిప్రసాద్, సభ్యులు వశిష్ట కిరణ్, శ్రీధర్, ఆదిలక్ష్మి, పద్మ, వెంకటలక్ష్మి, అనుపమ యాదవ్, రూప దత్త తదితరులు పాల్గొన్నారు.

Leave a Comment