Advertisements

విద్యార్థులు మానవీయ విలువలు నేర్చుకుని విజ్ఞానవంతులుగా నేటి పోటీ ప్రపంచంలో ముందుకెళ్లాలి

???? గూడూరు ఆర్డివో కిరణ్ కుమార్

విద్యార్థులు   మానవీయ విలువలు నేర్చుకుని విజ్ఞానవంతులుగా నేటి పోటీ ప్రపంచంలో ముందుకెళ్లాలని గూడూరు రెవిన్యూ డివిజనల్ అధికారి (ఆర్డివో ) కిరణ్ కుమార్ విద్యార్థులకు సూచించారు.

  కోట శ్రీ చైతన్య  విద్యాసంస్థలు ప్రతి సంవత్సరం పాల్గొనే నాసా నిర్వహించే  యన్.యస్.యస్ స్పేస్ సెటిల్మెంట్ కాంటెస్ట్ కు కోట  శ్రీ చైతన్య స్కూల్ నుంచి  శ్యామూల్ జాన్, సాయి సుధీప్, విజ్జెశ్వర్, చాతుర్య, అజిత్,కృతిక్, సాత్విక్ ప్రిన్స్ విద్యార్థులు పాల్గొంటున్నారు. వారిని ప్రోత్సహిస్తూ కోట ప్రగతిని విశ్వావ్యాప్తం చేయాలని ముఖ్య అతిధులు లక్ష్యనిర్దేశం చేశారు.2022 యన్.యస్.యస్ స్పేస్ సెటిల్మెంట్ కాంటెస్ట్ లో గెలుపొందిన విద్యార్థుల కొరకు గురువారం కోట శ్రీ చైతన్య స్కూల్ నందు అభినందన సభ ను స్కూల్ ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు  ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమం లో ముఖ్య అతిథిలుగా గూడూరు ఆర్డివో కిరణ్ కుమార్,  కోట తహసీల్దార్ పద్మావతి లు  పాల్గొన్నారు. ఆర్డివో కు ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థులు ఘన స్వాగతం పలికారు.ఈ సందర్బంగా ఆర్డివో ప్రసంగిస్తూ విద్యార్థులుగా మొదట  మానవీయ విలువలు నేర్చుకుని విజ్ఞానవంతులుగా నేటి పోటీ ప్రపంచంలో ముందుకెళ్లాలని చక్కని ప్రేరణ కలిగించారు.అంతేకాకుండా విద్యార్థులకు ఇస్రో, నాసా, చంద్రయాన్ 3, విక్రమ్ ల్యాండర్, ఆదిత్య L1 పై అవగాహన కల్పించి పలు ప్రశ్నలు అడిగి విద్యార్థుల ప్రతిభ ను వెలికి తీశారు.

ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో) అనేది బెంగుళూరు కేంద్రంగా ఉన్న భారత ప్రభుత్వం యొక్క మార్గదర్శక అంతరిక్ష పరిశోధనా సంస్థ. గ్రహాల అన్వేషణ మరియు అంతరిక్ష శాస్త్ర పరిశోధనలను కొనసాగిస్తూనే, జాతీయ అభివృద్ధిలో అంతరిక్ష సాంకేతికతను అభివృద్ధి చేయడానికి మరియు ఉపయోగించాలనే లక్ష్యంతో ISRO 1969లో ఏర్పడింది. ISRO 1962లో భారతదేశ మొదటి ప్రధాన మంత్రి పండిట్ స్థాపించబడిన దాని పూర్వీకుడు, INCOSPAR (ఇండియన్ నేషనల్ కమిటీ ఫర్ స్పేస్ రీసెర్చ్)ని భర్తీ చేసింది. జవహర్‌లాల్ నెహ్రూ మరియు శాస్త్రవేత్త విక్రమ్ సారాభాయ్, భారత అంతరిక్ష ప్రయోగాన్ని పితామహులుగా గుర్తించారు అనీ ఆర్డివో కిరణ్ కుమార్ విద్యార్థుల కు వివరించారు.నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ (NASA) అనేది ఏరోస్పేస్ మరియు ఏరోనాటిక్స్‌లో అధునాతన పరిశోధనలతో పాటు పౌర అంతరిక్ష కార్యక్రమంపై నియంత్రణలో ఉన్న యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా యొక్క ప్రభుత్వ యాజమాన్యంలోని ఏజెన్సీ. అంతరిక్ష విజ్ఞానం యొక్క శాంతియుత అనువర్తనాన్ని ప్రోత్సహించడానికి సైనికంగా కాకుండా పౌర ప్రాంతాల వైపు ప్రత్యేక ధోరణితో అప్పటి అధ్యక్షుడు డ్వైట్ D. ఐసెన్‌హోవర్ దీనిని స్థాపించారు అనీ విద్యార్థుల కు ఆర్డివో కిరణ్ కుమార్ వివరించారు.చంద్రుడి గుట్టు విప్పేందుకు ఇస్రో గత 15 ఏండ్లుగా చేస్తున్న ప్రయోగాలు సరికొత్త విషయాల్ని బయటపెట్టాయి. ఆఖరి నిమిషంలో చంద్రయాన్‌-2 విఫలమైనా.. ఓటమి నుంచి పాఠాలు నేర్చుకున్న ఇస్రో శాస్త్రవేత్తలు చంద్రయాన్‌-3తో జాబిల్లిపై విజయపతాకం ఎగురవేశారు.అక్టోబర్‌ 22, 2008న శ్రీహరికోట నుంచి చంద్రయాన్‌-1ను ప్రయోగించారు. ఈ సక్సెస్‌ ఇస్రోలో ఆత్మవిశ్వాసాన్ని నింపింది. జాబిల్లి ధ్రువ ప్రాంతాల్లోని నీటి జాడ ఉందని చెప్పే ముఖ్యమైన డాటా లభ్యమైంది. చంద్రుడిపై ఎక్కడ దిగాలన్న దానికి సంబంధించి హై రిజాల్యూషన్‌ మ్యాపుల్ని సమకూర్చింది.

రెండో లూనార్‌ మిషన్‌(చంద్రయాన్‌-2)ను జూలై 22, 2019న ఇస్రో చేపట్టింది. ఆర్బిటార్‌, ల్యాండర్‌, రోవర్‌లను స్పేస్‌క్రాఫ్ట్‌లో చేర్చి.. చంద్రుడిపైకి పంపింది. చంద్రుడికి 100 కిలోమీటర్ల ఎత్తులోని కక్ష్య వరకు విజయవంతంగా వెళ్లింది. ల్యాండర్‌ విక్రమ్‌ను వేరుపర్చే సంక్లిష్టమైన ప్రక్రియను చేపట్టడంలో సక్సెస్‌ అయ్యారు. సాఫ్ట్‌ ల్యాండింగ్‌ వద్ద విఫలమైంది. ఆర్బిటార్‌లోని 8 సైంటిఫిక్‌ పరికరాలు ఇప్పటికీ సమర్థంగా పనిచేస్తున్నాయి. చంద్రుడిపై సోడియం పుష్కలంగా ఉందని గుర్తించింది.జూలై 14, 2023న ఇస్రో ప్రయోగించింది. ప్రగ్యాన్‌ రోవర్‌ చంద్రుడి ఉపరితలంపై దిగి మట్టిని సేకరించటం, అందులో ఉండే మూలకాలను విశ్లేషించటం, నీటి జాడను గుర్తించటం ఈ మిషన్‌ ప్రధాన లక్ష్యం. అలాగే భూమి-చంద్రుడి మధ్య దూరాన్ని అత్యంత కచ్చితంగా కొలవటం. అంతుబట్టని విధంగా ఉన్న చంద్రుడి ఉపరితలం వాతావరణాన్ని ప్రగ్యాన్‌ రోవర్‌ మరింతగా శోధించనున్నది అనీ విద్యార్థులకు ఆర్డివో కిరణ్ కుమార్ వివరించారు.విశ్వం కోటానుకోట్ల నక్షత్రాల సమాహారం. ఈ నక్షత్రాలు నిరంతరం శక్తిని విడుదల చేస్తుంటాయి. విశ్వం పుట్టుక, భవిష్యత్తుల గురించి తెలుసుకోడానికి నక్షత్రాలే ప్రధాన ఆధారం.భూమికి దగ్గరగా ఉన్న నక్షత్రమైన సూర్యుడిని పరిశోధిస్తే, విశ్వం గురించిన మరింత సమాచారాన్ని తెలుసుకోవచ్చు. సూర్యుడి లాంటి నక్షత్రాల్లో ఉండే పరిస్థితులను భూమ్మీద సృష్టించి, వాటిపై పరిశోధనలు చేయడం అసాధ్యం.

అందుకే నేరుగా సూర్యుడిపైనే పరిశోధనలు చేసేందుకు అంతరిక్ష సంస్థలు ప్రయత్నిస్తున్నాయి. అందులో భాగంగానే ఇస్రో సూర్యుడి గురించి తెలుసుకునేందుకు చేస్తున్న ప్రయోగమే ఆదిత్య L1 అనీ ఆర్డివో కిరణ్ కుమార్ అన్నారు . ఇప్పటికే నాసా, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీలు సూర్యుడిని పరిశీలించేందుకు చాలా ప్రయోగాలు చేశాయి. సూర్యుడి గురించిన సమాచారం తెలుసుకోవడం మాత్రమే కాదు.. సూర్యుడి మీద నిరంతరం ఓ కన్నేసి ఉంచడానికే ఇస్రో ఈ ప్రయోగం చేస్తోంది.సూర్యుడిలో ఉత్పన్నమయ్యే సౌర తుపానులను ముందుగానే గుర్తించడానికి కూడా ఈ ప్రయోగం ఉపయోగపడుతుంది అనీ విద్యార్థులకు ఆర్డివో తెలియజేసారు.తల్లిదండ్రులు తమ సంతానానికి జన్మనివ్వడమేగాక తమ శక్తికి తగినట్లుగా అన్న వస్ర్తాలను సమకూరుస్తూ పెంచి పెద్ద చేస్తారు. నన్నింత ఉన్నతునిగా తీర్చిదిద్దిన నా తండ్రి ఆజ్ఞలను పాటించడమే నా జీవితంలో ప్రధాన కర్తవ్యం’. అడవులకు వెళ్లడం మానుకొని రాజ్యాన్ని పరిపాలించవలసిందిగా కోరినప్పుడు శ్రీరామచంద్రుడు, దాన్ని సున్నితంగా తిరస్కరిస్తూ, తమ రాజ పురోహితుడైన వసిష్ఠునితో అన్న మాటలివి. ‘సంతానాన్ని పెంచడానికి తల్లి పడే శ్రమ, తపన వెల కట్టలేనివి. అమ్మ నలుగుపెట్టి స్నానం చేయించి నిద్రపుచ్చుతుంది. ప్రేమతో మాట్లాడుతూ, ఆలనా పాలనా చూస్తూ ప్రాణప్రదంగా పెంచుతుంది. అలాంటి తల్లి ఋణాన్ని తీర్చుకోవడమనేది ఈ సృష్టిలో ఎవరికీ సాధ్యం కాదు’ అని  విద్యార్థుల కు ఆర్డివో సూచించారు.భారత మాజీ రాష్ట్రపతి, భారతరత్న అవార్డు గ్రహీత డాక్టర్‌ ఏపీజే అబ్దుల్‌ కలామ్‌ జీవితాన్ని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలని శ్రీ చైతన్య స్కూల్ విద్యార్థుల కు ఆర్డివో కిరణ్ కుమార్ సూచించారు. ఆర్డివో*
*మాట్లాడుతూ చిన్నతనం నుంచి కష్టపడటంతో మిస్సైల్‌ మ్యాన్‌ ఆఫ్‌ ఇండియాగా ప్రసిద్ధి చెందారని *కొనియాడారు. 1998వ సంవత్సరంలో ఫ్రోఖ్రాన్‌-2 అణుపరీక్షల్లో అబ్దుల్‌ కలాం ముఖ్యపాత్ర పోషించారని, క్షిపణిప్రాజెక్టుల అభివృద్ధికి ఎంతగానో కృషి చేశారన్నారు. దేశానికి ఆయన  చేసిన సేవలు ఎప్పటికి మరిచిపోలేనివని పేర్కొన్నారు. అబ్దుల్‌ కలాం సేవలకు గుర్తింపుగా భారతదేశ అత్యున్నత పురస్కారాలైన పద్మభూషణ్‌, పద్మవిభూషణ్‌, భారతరత్న పురస్కారాలు లభించాయన్నారు.రామేశ్వరం నుంచి రాష్ట్రపతి భవన్‌ వరకు… పేపర్‌ బాయ్‌ నుంచి రాష్ట్రపతి వరకు సాగిన  అబ్దుల్‌ కలామ్‌ జీవన ప్రస్థానం మనందరికీ స్ఫూర్తిదాయకమని ఆర్డివో కిరణ్ కుమార్ కొనియాడారు. అనంతరం గెలుపొందిన విద్యార్థులకు టి -షర్ట్స్, పెన్స్, మెడల్స్, ప్రశంసా పత్రాలు ఆర్డివో కిరణ్ కుమార్ చేతుల మీదుగా అందజేసి అభినందనలు తెలిపారు. అదేవిధంగా కార్యక్రమంలో శ్రీ చైతన్య పాఠశాల ప్రిన్సిపాల్ వేంకట సుధీర్ , జోనల్ డీన్ శివయ్య , నాసా ఇంచార్జి రామకృష్ణ , జోనల్ పి.డి. ఠాగూర్ మరియు ఉపాధ్యాయ బృందం పాల్గొని విద్యార్థులను అభినందించారు.

Leave a Comment

You May Like This