Advertisements

SEB ఇన్స్పెక్టర్ పి.  విజయకుమార్  గంజాయి నేరాలపై విస్తృతంగా దాడులు

Wisdom news అక్టోబర్-26

తిరుపతి జిల్లా SP పరమేశ్వర్ రెడ్డి మరియు తిరుపతి జిల్లా DSEO (ASP, SEB) అధికారి అయిన A. రాజేంద్ర  ఆదేశాల మేరకు గంజాయి నేరముల గురించి గూడూరు SEB టీమ్ తనిఖీలు చెయ్యడం జరిగింది.   గూడూరు పట్టణంలోని గమళ్ళపాలెం కు చెందిన ఒక వ్యక్తిని అరెస్టు చేసి, అతని వద్ద నుండి (1.5) KG ల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ముద్దాయి ని మీడియా ముందు ప్రవేశ పెట్టారు.  సిఐ .పి.విజయకుమార్ వివరాలు తెలియజేస్తూ ముద్దాయి గంపల మస్తానయ్య. తండ్రి: కృష్ణయ్య, వయస్సు 45 సం., స్వస్థలం సూళూరుపేట మండలం, గంపల కండ్రిక గ్రామానికి చెందిన వారు.

ముద్దాయి విచారణలో తెలిపిన వివరాల ప్రకారం… ఇతను వారం రోజుల క్రితం ఒడిశారాష్ట్రంలోని మల్కానికి జిల్లా నందలి చిత్రకొండ గ్రామ అటవీ ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తి నుండి 3000 రూపాయలకు సుమారు రెండు కేజీల గంజాయిని కొనుగోలు చేశాడని దానిలో కొంత గంజాయిని తాను త్రాగడానికి వాడుకొని మిగిలిన 15 కేజీ గంజాయిని గూడూరు పట్టణంలోని అరుంధతి పాలెం లో 15వేల రూపాయలకు అమ్మడానికి ప్రయత్నిస్తుండగా గూడూరు సెబ్ అధికారులకు సమాచారం అంది దాడులు నిర్వహించి అతనిని అరెస్టు చేసి అతని వద్ద ఉన్న ఒకటిన్నర కేజీ గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఇతనపైన గూడూరు సెబ్ స్టేషన్ లో క్రైమ్ నెంబర్ 29 2023 నందు NDPS చట్టం క్రింద కేసు నమోదు. చేశారు. ఇతనిని  గూడూరు AIMFC న్యాయస్థానంJ నందు ప్రవేశపెట్టి అనంతరం జుడీషియల్ కస్టడీకిగాను నెల్లూరు సెంట్రల్ జైలుకు తరలించడం జరుగుతుందని సి ఐ విజయకుమార్ తెలపారు.ఈ దాడులలో పాల్గొన్న గూడూరు SEB టీమ్ వారు:గూడూరు SEB టీం: (1)CI, P విజయ్ కుమార్, (2)SI. A శేషమ్మ, (3)HC M కిరణ్ సింగ్ | రమేష్ V.N ప్రసాద్ M.కృష్ణ, SK. భాష, TG ఆనందబాబు, రామ్ ప్రసాద్… పాల్గొన్నారు గత రెండు సంవత్సరముల కాలంలో గూడూరు SEB ఇన్స్పెక్టర్  విజయకుమార్ వారి టీమ్ గంజాయి నేరాలపై విస్తృతంగా దాడులు నిర్వహించి, 44 కేసులు నమోదు చేసి, 93 మందిని అరెస్టు చేయడం జరిగింది. మరియు 525 KG ల గంజాయిని, రెండు కార్లను సీజ్ చేశామని తెలిపారు.గంజాయి నిర్మూలనకు అనేక గూడూరు SEB టీమ్ అనేక చర్యలు చేపట్టామని(17) బైండోవర్ కేసులు- 12 హిస్టరీ షీట్స్-11 నమోదు చేశామని
తెలిపారు.మాదకద్రవ్యాలు మత్తు పదార్థాల వలన కలిగే నష్టాలపై విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు చేపట్టి ప్రజల్లో మరియు ముఖ్యంగా విద్యార్థుల్లో అవగాహన కల్పిస్తుమని కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నామని తెలపారు.

మాదకద్రవ్యాల వాడకం వల్ల కలిగే నష్టాలను తెలియజేస్తూ మరియు నేర సమాచారాన్ని అందించడానికి ప్రజల్లో చైతన్యం తెచ్చేలా గూడూరు పట్టణంలో వివిధ కాలేజీల ప్రాంగణాల్లో, జనసమర్ధప్రాంతాలలో (18) హెర్డింగ్స్ ఏర్పాటు చేశామని తెలపారు. అలాగే  మాదక ద్రవ్యాలు వలన కలిగే నష్టాలను తెలియజేస్తూ పోస్టర్లను ఏర్పాటు చేశామని మరియు ప్రజలకు పాంప్లెట్స్ పంచడం, కాలేజీలో డ్రగ్ అబ్యూస్ ప్రివెన్షన్ కమిటీల ఏర్పాటు, ర్యాలీలు వంటి అనేక కార్యక్రమాలను విస్తృతంగా చేపట్టడం జరుగుతుందని నేర సమాచార సేకరణకై ప్రభుత్వం వారు ఏర్పాటుచేసిన టోల్ ఫ్రీ నెంబర్ 14500 కు విస్తృత ప్రచారం కల్పిస్తుమన్నారు. గంజాయి వంటి డ్రగ్స్ కు సంబంధించిన సమాచారాన్ని ప్రజలు ఈ టోల్ ఫ్రీ నెంబర్ కు తెలియజేయవచ్చునితెలిపిన వారిని  పేర్లు గోప్యంగా ఉంచాతమని తెలపారు.

Leave a Comment