Advertisements

తిరుచానూరు రైల్వే స్టేషన్ ఆకస్మిక తనిఖీ చేసిన ఎంపీ గురుమూర్తి

తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి నేడు తిరుచానూరు రైల్వే స్టేషన్ ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. రైల్వే స్టేషన్ లో నిర్మాణంలో ఉన్న మొదటి, రెండవ ఫ్లాట్ ఫార్మ్ లను కలిపే అండర్ పాస్ లను పరిశీలించారు. అండర్ పాస్ లలో నీరు నిలవకుండా తగు చర్యలు తీసుకోవాలని కోరారు. మొదటి ఫ్లాట్ ఫార్మ్ పై నిర్మిస్తున్న క్యాంటీన్ మరియు ఫ్లాట్ ఫార్మ్ షెల్టర్ లను కూడా పరిశీలించారు. నాణ్యత విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని వారికి సూచించారు. త్వరితగతిన నిర్మాణాలు పూర్తి చేసి రైల్వే స్టేషన్ ను జనవరి నెలకంతా అందుబాటులోకి తీసుకు రావాలని రైల్వే అధికారులను కోరారు. ఈ రైల్వే స్టేషన్ అందుబాటులోకి వస్తే తిరుపతి ప్రధాన రైల్వే స్టేషన్ పై భారం తగ్గుతుందని తిరుమల విచ్చేసే యాత్రికులకు సౌకర్యవంతంగా ఉంటుందని అన్నారు. అలాగే హీరో హోండా షోరూమ్ వద్ద మరియు సిఆర్ఎస్ వద్ద నిర్మించ తలపెట్టిన రైల్వే అండర్ బ్రిడ్జిల టెండర్ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని కూడా వారిని కోరారు. ఈ తనిఖీలో ఎంపీ గురుమూర్తి గారితో కలిసి దక్షిణ మధ్య రైల్వే అసిస్టెంట్ డివిజినల్ ఇంజనీర్ మరియు వారి సిబ్బంది కలిసి పాల్గొన్నారు.

Leave a Comment