తిరుపతి జిల్లా
ఓజిలి మండలంలోని చిలమానుచేను గ్రామ సమీపంలో ని పాత ఐజేఎం ప్లాంట్ వద్ద గుర్తు తెలియని వాహనం ఢీకొని మహిళ మృతి చెందింది.చిలమానుచేను గ్రామానికి చెందిన ముంతల పద్మజ (35) స్కూటీపై గూడూరు నుంచి ఇంటికి వెళ్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది.
ఈమె చిల్లకూరు మండల పరిషత్ ఉపాధి హామీ కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్ గా విధులు నిర్వహిస్తోంది. మృతురాలికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఎస్సై దారం ఆదిలక్ష్మి సంఘటనా స్థలం చేరుకుని ప్రమాదంపై ఆరా తీస్తున్నారు.