తట్టలల్లి.. బుట్టలల్లి.. ఉండేందుకు నివాసం లేక అల్లాడుతున్న ఎస్టీల కోసం ప్రభుత్వం కేటాయించిన భూములను అధికార పార్టీ నాయకులు అమ్ముకుని సొమ్ముచేసుకుంటున్నారని. రేణిగుంట సమీపంలోని చెంగారెడ్డిపల్లి ఎస్టీ కాలనీ సమీపంలో జరుగుతందని st కాలిని వాసులు వాపోయారు వివరాలు ఇలా ఉన్నాయి. రేణిగుంట మండలం కరకంబాది సర్వే నంబర్ 538, 548 లో ప్రభుత్వ భూమి ఉంది. పక్కనే పూరి గుడిసెల్లో ఎస్టీలు నివాసం ఉంటున్నారు. ఇందులో ఎక్కువ మందికి ఇంటి స్థలాలు లేవు. తమకు ఇంటి స్థలాలు ఇవ్వాలని పలుమార్లు ఎస్టీలు ప్రభుత్వ అధికారులను వేడుకున్నారు.
అయినా అధికారులు కరుణ చూపలేదు కదా… అందులోని ప్రవేశించిన వారిపై అధికార జులుం ప్రదర్శించారు. అయితే ఈ భూములు హైవే కి పక్కన ఉండడంతో కొంతమంది అధికార పార్టీ నాయకులు అధికారులను మచ్చిక చేసుకుని ఇండ్లు నిర్మిస్తున్నారని ఎస్టీలు వాపోతున్నారు. ఈ స్థలంలో ఒక్కో జాగా ఐదు లక్షల చొప్పున సుమారు 100 ప్లాట్లు అమ్ముకున్నారని, అయినా అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. పక్కనే ఉన్న మాకు మాత్రమే ఇంటి స్థలాలు కేటాయించిన అధికారులు ఇతరులు ప్రభుత్వ భూమిని అమ్ముకుంటుంటే ఎందుకు నిమ్మకు నీరెత్తినట్లు ఉన్నారని ప్రశ్నిస్తున్నారు. ఈ స్థలాలు అమ్మి సుమారు ఐదు కోట్ల రూపాయల వరకు చేతులు మారాయని అంటున్నారు. ఇప్పటికైనా ఎమ్మెళ్యే, అధికారులు స్పందించి ఆక్రమణ దారుల నుండి ప్రభుత్వ భూమికి కాపాడలని కోరుతున్నారు. ఇంటి స్థలం కూడా లేని అర్హులైన పేదలకు ఇవ్వాలని కోరుతున్నారు. ఇప్పటికైనా ఎమ్మెల్యే, అధికారులు ఏమేరకు స్పందించి పేదలకు న్యాయం చేస్తారో వేచి చూద్దాం. కొసమెరుపు ఏంటంటే ఈ ఎస్టీలకు స్మశానంకు సైతం స్థలం లేకపోవడం గమనార్హం. ఉన్నా ఊరికి 5 కిలోమీటర్ల దూరంలో ఉందని వారు వాపోతున్నారు.