Advertisements

అక్రమ తవ్వకాలపై గూడూరు ఆర్డీవో మెరుపు దాడులు

అక్రమంగా తవ్వకాలపై RDO. కిరణ్ కుమార్  మెరుపు దాడులు.

అక్రమ మైనింగ్ చేస్తున్న వారిని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని గూడూరు ఆర్డీవో మీసాల కిరణ్ కుమార్ స్పష్టం చేశారు. అక్రమ తవ్వకాలపై అధిక ఫిర్యాదులు వస్తున్నాయని చెప్పిన ఆర్డీవో కిరణ్ కుమార్, ఇకపై అక్రమ తవ్వకాలను ఉపేక్షించేది లేదన్నారు. తిరుపతి జిల్లా చిల్లకూరు మండలం బూదనం రెవెన్యూ పరిధిలోని సర్వేనెంబర్ 805లో గత కొద్దిరోజులుగా అక్రమ మైనింగ్ జరుగుతుంది. ప్రతిరోజు రాత్రి అక్రమ తవ్వకాలు చేపట్టి పల్స్ఫర్, క్వార్జ్ రాళ్లను బయటకు తీసి వేసి తవ్వకాలు జరిగనట్లు బ్రమింపజేసెలా  పరిస్థితి కనిపిస్తున్నారు. ఈ సమాచారం అందుకున్న గూడూరు ఆర్డీవో కిరణ్ కుమార్ రాత్రి సమయంలో కూడా స్వయంగా తవ్వకాలు జరుగుతున్న ప్రాంతానికి చేరుకున్నారు. అక్కడ ఉన్న ఓ జెసిబిని స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బూదనం ప్రాంతానికి చెందిన దిలీప్ రెడ్డి అనే వ్యక్తి రాత్రి సమయాల్లో అక్రమ తవ్వకాలు జరిపి మైనింగ్ చేస్తున్నట్లు చెప్పారు. తాము ఇక్కడికి చేరుకునే సరికి పారారైనట్లు తెలిపారు. నిర్ణీత లక్ష్యంతో పేదలకు పంపిణీ చేసిన డికేటి భూముల్లో ఇలా తవ్వకాలు జరపడం చట్టరీత్యా నేరమని చెప్పారు.  ఇలాంటి విషయాలపై తానే స్వయంగా తవ్వకాలు జరిగే ప్రాంతానికి వస్తానని చెప్పారు. కింది స్థాయి అధికారులు రాజకీయ పరమైన వత్తిళ్ళతో ఇబ్బంది పడుతున్నారు కనుక తాను రావాల్సిన పరిస్థితి ఏర్పడుతుందన్నారు బూధనంలో స్వాధీనం చేసుకున్న జెసిపిని పోలీస్ స్టేషన్కు తరలిస్తామని దీని వెనుక ఎవరు ఉన్నా వారిపై కూడా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ప్రజలు స్వచ్ఛందంగా అక్రమ తవ్వకాలకు సంబంధించి సమాచారం ఇవ్వాలని కోరారు. పకృతి సంపదనం భావితరాలకు ఇవ్వాల్సిన ఆలోచన మాని వాటిని కొల్లగొట్టే పనిని ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు.

Leave a Comment