Advertisements

తెల్లరాయి స్మగ్లర్ల పై గూడూరు RDO కిరణ్ కుమార్ ఆదివారం రాత్రి ఆకస్మిక దాడులు

తెల్లరాయి స్మగ్లర్ల పై గూడూరు RDO కిరణ్ కుమార్ ఆదివారం రాత్రి ఆకస్మిక దాడులు

గూడూరు రెవిన్యూ డివిజన్ పరిధిలో ఇద్దరు వ్యక్తులు కిందిస్థాయి సిబ్బందిపై ఒత్తిడి తీసుకువచ్చి,బెదిరించి అక్రమ కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు వీరిపై ఇప్పటికే  ప్రభుత్వానికి ఫిర్యాదు చేశాం,ఇప్పుడు ఈ ఆధారాలు కూడా ప్రభుత్వ దృష్టికి తీసుకుపోతాం అన్న RDO కిరణ్ కుమార్

గూడూరు రెవిన్యూ డివిజన్ పరిధిలోనికొండాగుంట, వెడిచర్ల ప్రాంతాల్లో తెల్లరాయి అక్రమంగా లోడేస్తున్న ప్రాంతాల్లో ఆకస్మిక దాడులు చేసిన గూడూరు ఆర్డీవో ఎం కిరణ్ కుమార్*

యంత్రాలు వదిలి పారిపోయిన స్మగ్లర్లు ఘటనా స్థలంలో మూడు జెసిబిలు స్వాధీనం

గూడూరు రెవెన్యూ డివిజన్ పరిధిలో అక్రమ గ్రావెల్ తెల్లరాయి ఇసుక చిలుక లాంటి ఏ సహజ సంపదనైనా అక్రమ మార్గంలో తరలిస్తే చర్యలు తప్పు ఉన్న గూడూరు ఆర్డీవో కిరణ్ కుమార్*

గూడూరు రెవెన్యూ డివిజన్ పరిదిలో అక్రమార్కులు సహజ సంపదను కొల్లగొట్టకుండా రాత్రింబవళ్లు కర్రలు పట్టుకుని కాపలా కాస్తాం అన్న RDO కిరణ్ కుమార్

VRO, తహసీల్దార్ లాంటి కిందిస్థాయి ఉద్యోగులును ఎవరైనా ఒత్తిడికి గురి చేస్తే ఉద్యోగులు తనకు చెప్పవచ్చని ఒత్తిడినంతా తానే భరిస్తానని ఉద్యోగులకు భరోసా ఇచ్చిన RDO కిరణ్ కుమార్ సిబ్బంది  నిఘా ఉంచి అక్రమార్కుల సమాచారం తెలుసుకుని ఎక్కడికక్కడ అక్రమార్కులను అడ్డుకోవాలని ఆదేశాలు

గూడూరు రెవెన్యూ డివిజన్ పరిధిలోని అనేక ప్రాంతాల్లో అక్రమ తెల్లరాయి మైనింగ్ చేస్తున్నారు అన్న సమాచారంతో గూడూరు ఆర్డీవో ఎం కిరణ్ కుమార్ ఆదివారం రాత్రి తన సిబ్బందితో కలిసి రాత్రి 10.40 సమయంలో అక్రమ మైనింగ్ చేస్తున్న గూడూరు మండలం వెడిచర్ల ప్రాంతంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించి ఘటనా స్థలంలో మూడు జెసిబిలను స్వాధీనపరుచుకున్నారు, అధికారులు వస్తున్నారు అన్న సమాచారం మేరకు అక్రమార్కులు పరారయ్యారు,

ఈ సందర్భంగా గూడూరు ఆర్డీవో కిరణ్ కుమార్ మాట్లాడుతూ ఇద్దరు వ్యక్తులు గూడూరు రెవిన్యూ డివిజన్ పరిధిలో విఆర్ఓ ఆర్ ఐ తాసిల్దార్ లాంటి సిబ్బందిని బెదిరించి ఒత్తిడికి గురిచేసి అక్రమ మైనింగ్ కార్యకలాపాలు కొనసాగిస్తున్నారని సిబ్బంది ఒత్తిడికి గురి కావద్దని మీపై ఏదైనా ఒత్తిడి వస్తే తనకు తెలియజేయాలని ఎంత ఒత్తిడినైనా తానే భరిస్తానని నిత్యం అక్రమ కార్యక్రమాలకు పాల్పడుతున్న వారి పై నిఘా ఉంచాలని ఇప్పటికే అక్రమ  కార్యకలాపాలకు పాల్పడుతున్న ఆ ఇద్దరి   పై ప్రభుత్వానికి సమాచారం ఇచ్చామని, ఇకపై గూడూరు రెవిన్యూ డివిజన్ పరిధిలో తెల్లరాయి మాఫియా, సిలికా మాఫియా,సాండ్ మాఫియా, గ్రావెల్ మాఫియా,మట్టి మాఫియా ఇలా ఎలాంటి మాఫియానైనా అణిచివేస్తామని మాఫియాకు పాల్పడుతున్న వారిని కస్టడీ లోకి తీసుకుని ప్రజాక్షేత్రంలో నిలబెడతామని ఇలాంటి వారు ఈ ప్రాంతానికి అవసరమా అని ప్రజల ముందే ప్రశ్నిస్తామని,ఇలాంటి వారిని చేరదీయడం అవసరమా అని ప్రజలు తెలిసేలా చేయడానికే ఇలాంటి ఆకస్మిక దాడులు చేశామని,  భవిష్యత్తులో గూడూరు రెవెన్యూ డివిజన్ పరిధిలో ఎటువంటి మాఫియా అని కూడా ఈ ఎదగకుండా చేస్తానని గూడూరు ఆర్డీవో కిరణ్ కుమార్ తెలియజేశారు …

Leave a Comment