
తిరుపతి జిల్లా గూడూరు పట్టణం
నూర్ భాషాల ఆశయ సాధనాల కోసం అక్టోబర్ 29 వ తేదిఆదివారం సాయంత్రం గుంటూరులోని ఆంధ్రముస్లిం కాలేజీ రాష్ట్ర నూరుబాషా సంఘముఆధ్వర్యంలో సింహగర్జన సభను పురస్కరించుకుని శనివారం గోడ పత్రికలను ఆవిష్కరించారు. ఈసందర్భంగా ఆ సంఘం రాష్ట్ర కార్యదర్శి సలీమ్ భాయ్ మాట్లాడుతూ సింహ గర్జన సభకు రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుండి నూర్ బాషా ప్రతినిధులు, నూరుబాషా సోదరులు, మహిళలు హాజరవుతున్నారని తెలిపారు. నెల్లూరు జిల్లాలోని అన్ని మండలాల నాయకులు, నగర, జిల్లా, మహిళా, యూత్ కమిటీ, రాష్ట్ర నాయకులందరూ హాజరై ఈ సభను జయప్రదం చేయాలని కోరారు.చట్ట సభలలో నూర్ బాషాలకు అన్ని రాజకీయ పార్టీలు ఎమ్మెల్యే, ఎంపి సీట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు.మైనారిటీ పదవులలో వర్గీకరణ దామాషా ప్రకారం నూర్ బాషాలకు పదవులు కేటాయించాలన్నారు.చట్ట సభలలో ఏ పార్టీ ఐతే సూరు బాషాలకు అవకాశం ఇస్తుందే ఆ పార్టీకిహే సంపూర్ణ మద్దతు తెలుపుతామన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మహిళా వర్కింగ్ ప్రెసిడెంట్ షేక్ దిల్ షార్, గూడూరు మండల అధ్యక్షులు షేక్, చాంద్ బాషా, గూడూరు యూత్ అధ్యక్షులు షేక్ బాబా బాయ్, గూడూరు యూత్ ఉపాధ్యక్షులు షేక్ ఇబ్రహీమ్, షేక్. జిలాని, షేక్ ఖాదర్ బాబా, షేక్. ఖయ్యుమ్, టైలర్ షేక్ చాంద్ బాషా, షేక్. సుబాన్, షేక్ దూది నజీర్, షేక్, ఖాదర్ బాషా, షేక్ సలీమ్, షేక్ జైనుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.