తిరుపతి జిల్లా P పరమేశ్వర్ రెడ్డి మరియు తిరుపతి జిల్లా DSEO (ASP, SEB) అధికారి అయిన A.రాజేంద్ర ఆదేశాల మేరకు ఈరోజు గూడూరు ఆర్టీసీ బస్టాండ్ పరిసరాలలో గంజాయి నేరముల గురించి గూడూరు SEB టీమ్ తనిఖీలు చెయ్యడం జరిగింది.ఈ తనిఖీలలో గంజాయి కలిగి ఉన్న ఒడిశా రాష్ట్రానికి చెందిన ఒక వ్యక్తిని(A1)ఈశ్వర్ మడ్కామి, తండ్రి:దంబారు మడ్కామి, వయస్సు:26సం.నివాసం: మల్కాన్ గిరి,ఒడిశా రాష్ట్రం అరెస్టు చేసి, అతని వద్ద నుండి (3) KG ల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. విచారణలో నేరంతో సంబంధం ఉన్న మరో ఇద్దరు వ్యక్తులను A2, మౌలాలి అలియాస్ ఆలీ, చింతూరు గ్రామం, అల్లూరిసీతారామరాజు జిల్లా, ఆంధ్ర ప్రదేశ్. A3 మనోజ్, బెంగళూరు, కర్ణాటక రాష్ట్రం గుర్తించారుA2,A3 లు ఇద్దరిని త్వరలోనే అరెస్టు చేస్తాంఅని seb ఇన్స్పెక్టర్ విజయకుమార్ తెలపారు. విచారణలో పట్టుబడిన ముద్దాయి తెలిపిన వివరాల ప్రకారం ఈశ్వర్ మడ్కామి, తన స్నేహితుడైన (A2) మౌలాలి వద్ద నుండి (3) కేజీల గంజాయిని తీసుకుని బెంగళూరులో ఉండే A3 మనోజ్ అనే వ్యక్తికి గంజాయిని చేరవేస్తే ఈశ్వర్ కు మౌలాలి అనే వ్యక్తి రూ 5000/- ఇస్తాడు. బెంగుళూరులో ఈ గంజాయి విలువ ఒక్కొక్క కేజీ 20 వేల రూపాయలు ఉంటుందని అంచనా, అనగా దీని విలువ మొత్తం 60 వేల రూపాయలు ఉంటుందని తెలపారు. ఈ కేసుతో సంబంధం ఉన్న అందరినీ త్వరలోనే అరెస్టు చేస్తాం అని వెల్లడించారు. గూడూరు SEB ఇన్స్పెక్టర్. పి.విజయకుమార్ మీడియా తెలియజేస్తూ గత రెండు సంవత్సరముల కాలంలో గూడూరు SEB టీమ్ గంజాయి నేరాలపై విస్తృతంగా దాడులు నిర్వహించి మొత్తం (47) కేసులు నమోదు చేసి, (97) మందిని అరెస్టు చేయడం జరిగిందని మరియు (546) కేజీల గంజాయిని, రెండు కార్లను సీజ్ చేశామని. గంజాయి ఖిల్లాగా పేరుబడ్డ గూడూరు పట్టణంలోని అరుంధతిపాలెంలో విస్తృతంగా దాడులు నిర్వహించి, అక్కడ గంజాయిని పూర్తిగా నియంత్రించామని తెలపారు. అదేవిధంగా భూదనం టోల్ ప్లాజా వద్ద నిత్యం దాడులు నిర్వహిస్తూ NH16 పైన గంజాయి రవాణాను అరికట్టమని గూడూరు SEB టీమ్ గంజాయి నిర్మూలనకు అనేక చర్యలు చేపట్టారని వాటిలోఅవి: (1)బైండోవర్ కేసులు- 12 నమోదు చేశారు, (2) హిస్టరీ షీట్స్-11తెరిచారు.(3) మాదకద్రవ్యాలు, మత్తు పదార్థాల వలన కలిగే నష్టాలపై విస్తృతంగా అవగాహనా కార్యక్రమాలు చేపట్టి ప్రజల్లో మరియు ముఖ్యంగా విద్యార్థుల్లో అవగాహన కల్పిస్తు కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నారు (4) మాదకద్రవ్యాల వాడకం వల్ల కలిగే నష్టాలను తెలియజేస్తూ మరియు నేర సమాచారాన్ని అందించడానికి ప్రజల్లో చైతన్యం తెచ్చేలా గూడూరు పట్టణంలోని వివిధ కాలేజీల ప్రాంగణాల్లో,జన సమర్థ ప్రాంతాలలో(18 )హోర్డింగ్స్ ఏర్పాటు చేశారు..అలాగే మార్గద్ర వ్యాల వల్ల కలిగే నష్టాలను తెలియజేస్తూ పోస్టర్లను ఏర్పాటు చేశారు మరియు ప్రజలకు పాంప్లెట్స్ పంచడం, కాలేజీలో డ్రగ్ అబ్యూస్ ప్రివెన్షన్ కమిటీల ఏర్పాటు, ర్యాలీలు వంటి అనేక కార్యక్రమాలను విస్తృతంగా చేపట్టడం జరుగిందని నేర సమాచార సేకరణకై ప్రభుత్వం వారు ఏర్పాటుచేసిన టోల్ ఫ్రీ నెంబర్ 14500 కు విస్తృత ప్రచారం కల్పిస్తున్నారు. గంజాయి వంటి డ్రగ్స్ కు సంబంధించిన సమాచారాన్ని ప్రజలు ఈ టోల్ ఫ్రీ నెంబర్ కు తెలియజేయవచ్చును.ఈ దాడులలో పాల్గొన్న గూడూరు SEB టీమ్ వారు: గూడూరు SEB టీం; (1)CI ,P విజయ్ కుమార్, (2)SI, A శేషమ్మ, (3)HC M కిరణ్ సింగ్, EC’S :– P.రమేష్ ,SK.భాష,TG ఆనందబాబు. వీరిని ఉన్నతాధికారులు అభినందించారు.