Advertisements

పేద ప్రజలు ఆరోగ్యం శ్రద్ద పెట్టడం కోసమే జగనన్న సురక్ష – డి ఎం హెచ్ ఓ పెంచలయ్య

పేద ప్రజలు ఆరోగ్యం శ్రద్ద పెట్టడం కోసమే జగనన్న సురక్ష - డి ఎం హెచ్ ఓ పెంచలయ్య

పేదప్రజల కు ఇంటి వద్దనే కార్పొరేట్ వైద్యం ను అందించి అందరూఆరోగ్యం గా ఉండాలని ముఖ్య ఉద్దేశ్యం తో జగనన్న సురక్ష పదకం ను ప్రభుత్వం ప్రజల ముందుకు తీసుకు వచ్చిందని డి ఎం హెచ్ఓపెంచలయ్యఅన్నారు.సైదాపురం మండలం లో అనంత మడుగు జడ్పీ ఉన్నత పాఠశాల లో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం సొసైటీ చైర్మన్ గోగినేని శివకుమార్ నాయుడు ఆధ్వర్యంలో నిర్వహించారు. జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని  డి యమ్ ఎచ్ ఓ పెంచలయ్య మధ్యాహ్నం రెండుగంటల సమయంలో ఆకస్మికంగా తనిఖీ చేశారు.ఈ సందర్భంగా ప్రజలకు అందుతున్న వైద్య సేవలు రోగులు ఏ ఏ వ్యాధులు ఎక్కువ గా వచ్చాయని సిబ్బందిని అడిగారు.అలాగే కంటి వ్యాధుల తో బాధపడే వృద్దులకు కళ్ళ జోడు లను అందజేశారు.జగనన్న సురక్ష ద్వారా పేద ప్రజలకు అనంతమడుగు గ్రామం లోనే ప్రభుత్వం అందిస్తున్న కార్పొరేట్ వైద్య సేవలను  అందరికి అందేలా  ప్రజలందరికీ వివరించి వైద్య సేవలు ను ఉచిత మందులను అందజేసేలా శివకుమార్ నాయుడు కృషి చేశారు.ఈ కార్యక్రమం లో తహాశీల్దార్ శ్రీనివాసులు,ఎంపీడీవో ఎం వెంకటేశ్వర్లు,డాక్టర్ శ్రావణి,డాక్టర్ జనార్దన్ ,డాక్టర్ టి శ్రీధర్,కంటి వైద్య నిపుణులు గురవయ్య,సొసైటీ చైర్మన్ శివ కుమార్,ఎం పి డి ఓ కార్యాలయం ఏవో శివకుమార్,వైసిపి సీనియర్ నాయకులు సుధాకర్, పెంచలయ్య,ఎంపీటీసీ వెంకట రమణయ్య, సర్పంచి కుమారి, అంగన్వాడి వర్కర్స్, సూపర్వైజర్లు, ఏఎన్ఎం, మహిళా పోలీసులు,ఆశ వర్కర్లు, వాలంటీర్లు పాల్గొన్నారు.

Leave a Comment