Advertisements

ఘనంగా గూడూరు వైసీపీ నాయకులు మహేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు

ఘనంగా గూడూరు వైసీపీ నాయకులు మహేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు

వైసిపి యువ నాయుకులు, గూడూరు జడ్పిటిసి ఊటుకూరు యామిని భర్త మహేంద్ర రెడ్డి జన్మదిన వేడుకలను గూడూరు రూరల్  మండల వైసీపీ నాయకుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. బుధవారం స్థానిక టవర్ క్లాక్ వద్ద మహేంద్ర రెడ్డి జన్మదిన వేడుకలను పురస్కరించుకుని ముఖ్య అతిథిగా హాజరైన వైసిపి రాష్ట్ర సీఈసీ సభ్యులు యల్లసిరి గోపాల్ రెడ్డి చేతుల మీదుగా కేక్ ను కట్ చేసి అందరికీ పంచి పెట్టారు.అనంతరం అన్నదాన కార్యక్రమం చేశారు.ఈ సందర్భంగా గోపాల్ రెడ్డి మాట్లాడుతూ మహేంద్ర రెడ్డి వైయస్ రాజశేఖర్ రెడ్డి మృతి చెందిన తర్వాత నెల్లటూరు లో  వైయస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహాన్ని ఏర్పాటు చేసి జగన్మోహన్ రెడ్డి తో వెన్నంటి నడిచిన వ్యక్తి అన్నారు.ఎలాంటి పార్టీ ప్రయోజనం ఆశించకుండా  పార్టీ బలోపేతానికి కృషి చేశారన్నారు.మహేంద్ర రెడ్డి జన్మదిన వేడుకలను మరెన్నో జరుపుకోవాలని దేవుడిని ప్రార్థిస్తున్నాన్నారు. ఈ కార్యక్రమంలో విందూరు ఎంపిటిసి వెంకటరెడ్డి,వైసిపి నాయుకులు యల్లా శ్రీనివాసులు రెడ్డి, సురేష్ రెడ్డి, పెంచల రాజు,నన్నూరు రాజశేఖర్,చల్లా తిరుపాలు, ధనుంజయ రెడ్డి,కొండా నారాయణ, కోటేశ్వర రావు తదితరలు పాల్గొన్నారు.

Leave a Comment