Advertisements

గ్రావెల్, పల్సర్ వ్యాపారం చేయాలంటే  కప్పం కొట్టాల్సిందే ఆర్డవో. కిరణ్ కుమార్

ఆర్డవో. కిరణ్ కుమార్ ప్రెస్ మీట్

తిరుపతి జిల్లా
గూడూరు, చిల్లకూరు,సైదాపురం మండలాల్లో విరివిగా లభించే గ్రావెల్, పల్సర్ వ్యాపారాలకు  ప్రభుత్వ అనుమతులతో వ్యాపారాం చెయ్యాలని
గ్రావెల్, పల్సర్ వ్యాపారం చేయాలంటే  తప్పకుండా కప్పం కొట్టాల్సిందే అని ఆర్డవో. కిరణ్ కుమార్ సూచించారు. కొంతమంది  నాయకులు  గ్రావెల్, పల్సర్ వ్యాపారులుకు  ఆర్డవో అడ్డుగా ఉన్నాడని,ఆర్డవో పైనే బురద చల్లే ప్రయత్నం చేశారు. మైనింగ్ వ్యాపారులుకు ఆర్డీవో కిరణకుమారే అండగా ఉంటూ అక్రమాలకు తోడ్పాడుతున్నాడని ఆరోపణలు చేశారు.ఈ విషయం పై సోమవారం స్పందన కార్యక్రమంలో భాగంగా  స్థానిక ఆర్టీవో కార్యాలయంలో ఆర్డీఓ కిరణ్ కుమార్ ను అక్రమ వ్యాపారస్తులకు అండగా ఉన్నారనే ఆరోపణలపై విలేకరులు వివరణ కోరగా. ఇటీవల గూడూరు మండలం నాంచారం పేట లో గ్రావెల్,చెన్నూరు బిట్-2లో తెల్ల రాయిని, చిల్లకూరు మండలంలోని కొన్ని గ్రామాల్లో అక్రమ గ్రావెల్ వ్యాపారాలు వైసిపి మాఫియా నాయకుల కనుసనల్లో జరుగుతున్న అక్రమ వ్యాపారాన్ని అడ్డుకునేందుకు తన ఆదేశాల ప్రకారం  సిసిఅఖిల్  హిటాచీలను, టిప్పర్లను స్వాధీనం చేసుకొని కేసు లు నమోదు చేసిన విషయాన్ని వివరించారు.

దీంతో  కొంతమంది నాయకులు జీర్ణించుకోలేక తనపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని ఆ ఆరోపణలను రుజువు  చేస్తే దేనికైనా సిద్దమని పేర్కొన్నారు. తాను ఎప్పుడూ అవినీతికి పాల్పడలేదని ప్రజలకు సేవ చేయడమే తన భాద్యతగా విధులు నిర్వహిస్తున్నామన్నారు. అక్రమ గ్రావెల్,క్వార్ట్జ్ చేస్తున్న వ్యాపారుల మాఫియా ఏ స్థాయిలో ఉన్నా వారి భరతం పడతానని హెచ్చరించారు.

Leave a Comment