న్యాయాన్ని ధర్మాన్ని – దానం చేయండని బిక్షాటన చేస్తూ వినూత్న రీతిలో రిలే దీక్ష చేపట్టిన- గూడూరు టీడీపీ మాజీ శాసన సభ్యులు సునిల్ కుమార్.
జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు అక్రమ రిమాండ్ కు తరలించారని నాయకులు అన్నారు.ఈ నేపథ్యంలో 27 రోజులు గా
రిలే నిరాహార దీక్షలు చేపట్టారు
అందులో భాగంగా 27 రోజు పార్టీ కార్యాలయం నందు కోట మండలం నాయకులు మరియు కార్యకర్తలతో కలసి ఈ రాష్ట్రంలో న్యాయాన్ని ధర్మాన్ని దానం చేయండని బిక్షాటన చేస్తూ వినూత్న రీతిలో దీక్షలు చేపట్టారు.
ఈ సందర్భంగా
పాశిం సునీల్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ…మేము చేస్తున్న ఈ దీక్షలకు రాష్ట్ర అనుబంధ TNTUC కమిటీ ప్రధాన కార్యదర్శి సిందుజా వచ్చి సంఘీబావం తెలిపారని బడుగు బలహీన వర్గాల కోసం స్వర్గీయ NTR గారి స్థాపించిన పార్టీ ని ముందుండి నడిపిస్తున్న ఏకైక నాయకుడు చంద్రబాబు నాయుడే అని అన్నారు. 14 సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా ఉండి , హైదరాబాద్ ను దేశంలో IT హబ్ గా మార్చిన ఘనుడు చంద్రబాబు నాయుడే అని గుర్తు చేసురు.ఎంతో మందికి ఉపాధి కల్పించిన ఘనుడు మా నాయకుడు అని అన్నారు.
అటువంటిది స్కిల్ డెవలప్మెంట్ లో అవినీతి చేసారంటూరిమాండ్ కి పంపడం దారుణం అని అన్నారు.మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు ఆంధ్ర రాష్ట్ర ప్రజల్లో పెరుగుతున్న ఆదరణ చూసి తట్టుకోలేక అక్రమ కేసులు పెట్టి రిమాండ్ కు పంపారని ఈ ముఖ్యమంత్రి ఒక్క చాన్స్ అధికారం చేపట్టి అందరిని మోసం చేసారని, ఈ ప్రభుత్వ పాలనకు నిరసనగా ఈ రోజు నియోజకవర్గంలోని విశ్వబ్రాహ్మిణుల సేవా సంఘం వారు కూడా వచ్చి సంఘీబావం తెలిపారని ఈ ప్రభుత్వం ఎన్ని అక్రమ కేసులు పెట్టిన మా నాయకుడు కడిగిన ముత్యం వలే బయటకు వస్తారని అని అన్నారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి శీలం కిరణ్ కుమార్,కార్యదర్శి నెలబల్లి భాస్కర్ రెడ్డి, కోట మండల పార్టీ అధ్యక్షులు మద్దాలి సర్వోత్తమ రెడ్డి, గూడూరు రూరల్, చిల్లకూరు మండల పార్టీ అద్యక్షులు కొండూరు వెంకటేశ్వర్లు రాజు,ఉచ్చూరు వెంకటేశ్వర్లు రెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి బిల్లు చెంచురామయ్య,రాష్ట్ర రైతు కార్యదర్శి భాస్కర్ రెడ్డి,నాయకులు పాదర్తి కోటేశ్వర రెడ్డి,రాధాకృష్ణ రెడ్డి,వెంకటకృష్ణ రెడ్డి,జలీల్ అహ్మద్,కోకొల్లు మధు యాదవ్, శ్రీధర్ రెడ్డి,దార సురేష్,తీగల సురేష్,సంసుద్ధిన్, మురళి,మాజీ కౌన్సిలర్లు వాటంబేటీ శివకుమార్,ఇశ్రాయల్ కుమార్,గాయం రమణయ్య, జనార్ధన్ రెడ్డి,మహిళలు గుండాల లీలావతి,మట్టం శ్రావణి రెడ్డి,గుండాల భారతి,సుధా, రేవతి,లక్ష్మీ, మండల కార్యకర్తలు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.