ఈరోజు తిరుపతి జిల్లా చిల్లకూరు లో ని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, పేద ప్రజల ఆశాజ్యోతి, జగన్ మోహన్ రెడ్డి ప్రవేశ పెట్టిన జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ఒక వరం అని ఆంధ్రప్రదేశ్ శాసన మండలి సభ్యులు బల్లి కళ్యాణ్ చక్రవర్తి తెలిపారు. ఈరోజు తిరుపతి జిల్లా చిల్లకూరు లో ని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన జగనన్న ఆరోగ్య సురక్ష వైద్య శిబిరం లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనమండలి సభ్యులు బల్లికళ్యాణ్ పాల్గొన్నారు.ఈరోజు జరిగిన జగనన్న ఆరోగ్య సురక్ష వైద్య శిబిరం విధానాన్ని,వైద్యులని,ఏ.ఎన్.యమ్ లని,సచివాలయంసిబ్బందిని అడిగి తెలుసుకొని రాబోవు జరిగే జగనన్న ఆరోగ్య సురక్ష వైద్య శిబిరాలు గురించి పలు సూచనలు ఇచ్చారు.
జగనన్న ఆరోగ్య సురక్ష వైద్య శిబిరంలో ప్రజలు రూపాయి ఖర్చు లేకుండా ఉచితంగా స్పెషలిస్ట్ వైద్యుల సేవలను పొందుతున్నారన్నారు. డాక్టర్లు సూచించిన మందులను ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేస్తున్న శుభ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వై.యస్ జగన్ మోహన్ రెడ్డి కి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనమండలి సభ్యులు బల్లి కళ్యాణ్ చక్రవర్తి అన్నారు. జగనన్న ఆరోగ్య సురక్ష వైద్య శిబిరంలో ఎంతమందికి ఉచిత వైద్య పరీక్షలు మరియు ఉచిత మందులు పంపిణీ చేశారనివైద్యులను,ఏ.ఎన్.యమ్ లను మరియు సచివాలయం సిబ్బందిని అడిగి తెలుసుకోవడం జరిగింది.ఈ కార్యక్రమంలో గూడూరు మునిసిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు,చిల్లకూరు మండలం తహశీల్దారు శ్రీనివాసులు,వై.యస్.ఆర్.సి.పి నాయకులు చిల్లకూరు సాయి ప్రసాద్ రెడ్డి గారు, పరందామ రెడ్డి ,దాసరివెంకటేశ్వర్లు,సచివాలయం సిబ్బంది మునిసిపల్ సిబ్బంది పాలోన్నారు.