Advertisements

మల్లాం సుబ్రహ్మణ్యేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలలో పాలోన్నా ఆర్డవో. కిరణ్ కుమార్

తిరుపతి జిల్లా, చిట్టమూరు మండలం లోని మల్లాం గ్రామం లో చరిత్ర కలిగిన  శ్రీ వల్లీ దేవసేన సమేత శ్రీ స్వయంభువుశ్రీసుబ్రహ్మణ్యేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవం జరిగేందుకు పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు అందించిన గూడూరు ఆర్డివో కిరణ్ కుమార్ సేవలు ఎన్నటికీ మర్చిపోలేము  అనీ అయనకు మల్లాం గ్రామ ప్రజలు, దేవస్థానం కమిటీ తరుపున  జిల్లా వ్యవసాయ  సలహా మండల సభ్యులు దువ్వూరు శేషు రెడ్డి,ఆలయ ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ శ్రీ చిల్లకూరు సాయికుమార్ రెడ్డి లు ధన్యవాదములు తెలిపారు.

శుక్రవారంమల్లాంబ్రహ్మోత్సవాల్లో  ఆఖరి రోజున స్వామి వారికి అత్యంత వైభవం గా ఊంజల సేవ మరియు ఏకాంత సేవ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గూడూరు ఆర్డీవో కిరణ్ కుమార్ పాల్గున్నారు. ఆర్డివోకు  ఆలయ ట్రస్ట్ బోర్డ్ సభ్యులు ఘన స్వాగతం పలికి స్వామి దర్శనం చేయించి ఆలయ సంప్రదాయం ప్రకారం ఆర్డివో ను కమిటీ వారు ఘనంగా సత్కరించితీర్థప్రసాదాలుఅందజేశారు.ఈకార్యక్రమానికి ఉభయ దాతగా తిరుమూరు గ్రామానికి చెందిన గండవరం రామచంద్రారెడ్డి ఉభయదాతగా వ్యవహరించారుఈ సందర్భంగా ఆలయ ట్రస్ట్ బోర్డ్ చైర్మన్  చిల్లకూరు సాయికుమార్ రెడ్డి మాట్లాడుతూ మల్లాం గ్రామం లోశ్రీ వల్లీ దేవసేన సమేత శ్రీ స్వయంభువు శ్రీసుబ్రహ్మణ్యేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు  అత్యంత వైభవముగా నిర్వహించేందుకు మాకు అన్ని విధముల పూర్తి సహాయ సహకారాలు అందించిన ఆర్డివో కిరణ్ కుమార్ కు  ప్రత్యేకంగా ధన్యవాదములు తెలిపారు.

బ్రహ్మోత్సవాలు సందర్బంగా దేవస్థానం వద్ద ఆక్రమణలు తొలగించాలని చిట్టమూరు లో జరిగిన జగనన్న కు చెబుదాం కార్యక్రమం లో జాయింట్ కలెక్టర్, ఆర్డివో కిరణ్ కుమార్ లకుమల్లం గ్రామస్తులు పిర్యాదుచేయడం తో జె సి ఆదేశాల మేరకు రంగంలోకి దిగిన ఆర్డీవో కిరణ్ కుమార్ వారం రోజుల్లోనే ఆక్రమణలు తొలగించి చరిత్ర సృష్టించారు అనీ చెప్పారు.ఆర్డివో చేపట్టిన ఆక్రమణ తొలగింపుతో  స్వామి వారి బ్రహ్మోత్సవాలకు దేవస్థానం కు వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యాలకు గురి కాకుండా నేరుగా వచ్చి స్వామివారి దర్శనం చేసుకొని సంతోషంగా భక్తులు వచ్చి పోతున్నారు అనీ చెప్పారు. గతంలో ఆక్రమించు కున్న స్థలాల్లో ఆక్రమణదారులు దుకాణాలు నిర్మించుకొని కొందరు మద్యం గంజాయి అమ్మేవారిని వారు తెలిపారు.

అంతేకాకుండా దేవస్థానం వచ్చే భక్తులు పట్ల అసభ్యంగా ప్రవర్తించే వారు. దేవస్థానం కు వచ్చే భక్తులు పలు రకాల ఇబ్బందులు ఎదుర్కొన్నే వారు,గతంలో పలుమార్లు వారిపై పోలీసు వారు దాడి జరిపి ఎన్నో కేసులు నమోదైన సందర్భాలు కూడా ఉన్నాయని గుర్తు చేశారు.మద్యం, గంజాయి, కల్లు దుకాణాలు అమ్మే వారు గ్రామస్తులు అయిపోయారు.కానీ ఈ సంవత్సరం ఆబెడద లేదని తెలిపారు.గుడికి వచ్చే భక్తులు దేవస్థానం కు కూడా వచ్చి ఎటువంటి ఇబ్బంది లేకుండా స్వామివారి దర్శనం  చేసుకొని వెళ్లుతున్నారు అనీ తెలిపారు.అనంతరం స్వామి వారి ఏకాంత సేవ పూర్తి అయ్యే వరకు ఆర్డివో దేవస్థానం లో ఉన్నారు.ఈ కార్యక్రమంలో  జిల్లా వ్యవసాయ  సలహా మండల సభ్యులు దువ్వూరు శేషు రెడ్డి మరియు కమిటీ సభ్యులు పార్థసారది రెడ్డి,  పంట్రాంగం  మణి మరియు స్వామి సేవకులు భాస్కర్ రెడ్డి, కాపులూరు లోకేష్, ఉభయ దాతగా తిరుమూరు  గండవరంరామచంద్రారెడ్డి,గ్రామస్తులు సిబ్బంది సుబ్బరామయ్య, శ్రావణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు

Leave a Comment