అంబరాన్నిఅంటిన వైసీపీ సినియర్ నాయుకుడు యద్దల నరేంద్ర రెడ్ది పుట్టిన రొజు వేడుకలు.
వేడుకులకు ముఖ్య అతిధిగా విచ్చేసిన ఎమ్మెల్సీ మేరిగమురళీ
గూడురు మడలంలో అంగరంగ వైభవంగా. ఎంపీపీ గురవయ్య ఆధ్వర్యం లో పుట్టిన రోజు వేడుకులు. ఘనంగా నిర్వహించరు .
వైసిపి నాయకులు మద్య పుట్టిన రోజూ వేడుకులు బారీఎత్తున కోలాహలంగా జరింగింది .
ఎమ్మెల్సి మెరిగా మురళీ ,ఎంపీపీ ,
కలిసి భారీ కేక్ ను కట్ చేసి శుభాకాంక్షలు తెలిపిన నాయకులు .
తిరుపతి జిల్లా గూడూరు పట్టణం లోని మండలకార్యాలయంలో, గూడూరు మండలం వైసీపీ సీనియర్ నాయకులు యద్దల నరేంద్ర రెడ్డి పుట్టినరోజు కార్యక్రమం, ఉమ్మడి నెల్లూరు జిల్లా స్థానిక సంస్థల శాసన మండలి సభ్యులు, శాసన మండలి విప్ మేరిగమురళీ ధర్ ముఖ్య అతిధిగా, గూడూరు ఎంపీపీ గురవయ్య ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది.
గూడూరు మండలం లోని ఎంపీటీసి లు, సర్పంచ్ లు వైసీపీ నాయకులు కార్యకర్తలు మధ్యలో 40కేజీ ల కేకు ను, నాయకులతో కలిసి ఎమ్మెల్సీ కట్ చేశారు. ఎమ్మెల్సీ మేరిగ మాట్లాడుతూ, వృత్తి పరంగా పారిశ్రామిక వేత్త అయిన నరేంద్ర రెడ్డి, జగన్ మోహన్ రెడ్డి పాదయాత్ర సమయంలో, నేను నియోజకవర్గం ఇంచార్జి గా ఉన్నప్పుడు,పార్టీ కి ఎంతో సహాయం చేయడమే కాకుండా, దాదాపు పాదయాత్ర పూర్తయ్యే వరకు జగన్ మోహన్ రెడ్డి కి ప్రత్యేకంగా భోజనం, పండ్లు, ఆయన కు కావలసిన ఏర్పాట్లు అన్నీ తన మనుషులను పెట్టి చేయించిన మంచి మనసున్న వ్యక్తి నరేంద్ర రెడ్డి అని కొనియాడారు.
తరువాత వచ్చిన స్థానిక సంస్థల ఎన్నికలు,సార్వత్రిక ఎన్నికలలో ప్రతీ గ్రామం తిరిగి, కోట్లు రూపాయలు ఖర్చుపెట్టి,నాయకులు అందరినీ ఏకం చేసి, పార్టీ కి చెందిన అభ్యర్థులను గెలిపించడం లో ప్రధాన పాత్ర నరేంద్ర రెడ్డి దే అన్నారు. తరువాత వచ్చిన శాసన సభ ఎన్నికలలో, నరేంద్ర రెడ్డి ని సూళ్లూరుపేట నియోజకవర్గం ఎన్నికలు పరిశీలకులుగా పార్టీ ప్రకటించడం, అప్పుడు ఆయన అటు, సూళ్లూరుపేట నియోజకవర్గం, ఇటు గూడూరు మండలంలో విస్తృతం గా పర్యటించి పార్టీ గెలుపుకోసం అహర్నిశలు పనిచేసి, పార్టీ అభ్యర్థులు అఖండ మెజారిటీ తో గెలిచేలా కృషి చేసిన వ్యక్తి నరేంద్ర రెడ్డి అన్నారు.
అటువంటి వ్యక్తి తన పుట్టినరోజు నాడు ఇక్కడ అందుబాటులో లేకపోయినా ఆయన మీద ఉన్న అభిమానం, ప్రేమ తో ఇక్కడ నరేంద్ర రెడ్డి 52 వ పుట్టినరోజు జరుపుకోవడం, అది కూడా నాయకులు, కార్యకర్తలు మధ్య జరుపుకోవడం చాలా సంతోషం గా ఉందన్నారు. ఎంపీపీ గురవయ్యమాట్లాడుతూ,ఎక్కడో పనిచేసుకుంటూ జీవిస్తున్న నన్ను, పార్టీ కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటున్నాను అని చూసి, ఒక వాలంటీర్ గాచేసి, ఆ తరువాత కాలంలో ఎంపీటీసి గా గెలిపించడమే కాకుండా, ఏకంగా గూడూరు మండలం ఎంపీపీ గా చేసిన మహోన్నత వ్యక్తి నరేంద్ర రెడ్డి అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తానికి జగన్ మోహన్ రెడ్డి దేవుడు అయితే, నాకు నరేంద్ర రెడ్డి దేవుడు అన్నారు. నన్ను ఎంపీపీ గా చేయడం లో అప్పటి ఆంధ్రప్రదేశ్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్, ప్రస్తుతఎమ్మెల్సీ మేరిగ మురళీ సహకారం మరువలేనిది అన్నారు. నన్ను ఇంతటి స్థాయి లో పెట్టిన మా నరేంద్ర రెడ్డి నిండునూరేళ్ళు ఆయురారోగ్యాలతో జీవించాలని, భవిష్యత్తు లో మరెన్నో పదవులు పొందాలని కోరుకుంటున్నాను అన్నారు.
సునీల్ రెడ్డి, శ్రీనివాసులు రెడ్డి మాట్లాడు తూ, ఎమ్మెల్సీ మేరిగమురళి, నరేంద్ర రెడ్డి లది ఎప్పటికి విడదీయ లేని బంధం అని, ఒకరు ఆత్మ అయితే మరొకరు శరీరం అన్నారు. ఒకరు అడుగు అయితే మరొకరు శబ్దం అన్నారు. ఎమ్మెల్సీ మేరిగ మురళి ప్రతీ ఎదుగుదలకు నరేంద్ర రెడ్డి ప్రోత్సాహం ఉందన్నారు. నరేంద్ర రెడ్డి ఈరోజు ఇక్కడ లేకపోయినా ఆయన అభిమానులు అయిన మేము ఆయన పుట్టినరోజు ను ఘనంగా జరుపుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు. అనంతరం కేకు ను కట్ చేసి ఎమ్మెల్సీ అందరికీ తినిపించారు. ఎమ్మెల్సీ కి నాయకులు తినిపించారు. పుట్టినరోజు శుభాకాంక్షలు నరేంద్ర రెడ్డి అంటూ, జై జగన్, జై ఎమ్మెల్సీ మేరిగ మురళి అంటూ నినాదాలు ఇచ్చారు. నాయకులు సునీల్ రెడ్డి ఏర్పాటు చేసిన భారీ అన్నదానం కార్యక్రమం ను ఎమ్మెల్సీ చేతులు మీదుగా వడ్డీంచి, ఎమ్మెల్సీ కూడా అక్కడే భోజనం చేశారు. నాయకులు, కార్యకర్తలు, అక్కడ కి విచ్చేసిన వివిధ గ్రామాల ప్రజలు, నరేంద్ర రెడ్డి నిండునూరేళ్ళు చల్లగా ఉండాలి అంటూ ఆశీస్సులు ఇచ్చారు. ఈ కార్యక్రమం లో మహేంద్ర యాదవ్, ప్రభాకర్ రాజు, కొట్టు గోవర్ధన్, గోపి యాదవ్, బల్లి వెంకటేశ్వర్లు, రవి రాజు, ఇనమళ్ళ శీనయ్య, శ్రీకిరెడ్డి శ్రీనివాసులు రెడ్డి, కృష్ణా రెడ్డి దయాకర్, పనీంద్ర రెడ్డి, అల్లం వెంకటేశ్వర్లు, వివిధ గ్రామాల సర్పంచ్ లు ఎంపీటీసి లు, కార్యకర్తలు పాల్గొన్నారు.