తిరుపతి జిల్లా SP పరమేశ్వర్ రెడ్డి మరియు తిరుపతి జిల్లా DSEO (ASP, SEB) అధికారి అయిన A. రాజేంద్ర ఆదేశాల మేరకు తిరుపతి జిల్లా గూడూరు మండలంలో గత రెండు సంవత్సరముల కాలంలో గూడూరు SEB ఇన్స్పెక్టర్ విజయకుమార్ వారి టీమ్ గంజాయి నేరాలపై విస్తృతంగా దాడులు నిర్వహించి, 44 కేసులు నమోదు చేసి, 93 మందిని అరెస్టు చేయడం జరిగింది. మరియు 525 KG ల గంజాయిని, రెండు కార్లను సీజ్ చేసినారు. ఆదే దూకుడు తో ప్రతి రోజు గంజాయి పై విస్తృతంగా దాడులు నిర్వహణ లో బాగంగా ఈరోజు చిల్లకూరు మండల పరిధిలోని బూధనం టోల్ ప్లాజా వద్ద తణుకు డిపో కి చెందిన తణుకు నుండి తిరుపతికి వెళుతున్న APSRTC_SUPER LUXURY AP0325622 – బస్సుతో ప్రయాణిస్తున్న గంజాయి కలిగిన తమిళనాడు రాష్ట్రంలోని మదురై కి చెందిన ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసి, వారి వద్ద నుండి (16) KG ల గంజాయిని స్వాధీనం చేసుకొని ముద్దాయిలను మీడియా ముందు ప్రవేశ పెట్టారు.
ముద్దాయిలిద్దరూ విచారణలో తెలిపిన వివరాల ప్రకారం మధురై కి చెందిన మహేష్ కు స్నేహితుడైన శివ అనే వ్యక్తి వీరిద్దరిని గంజాయి తీసుకురమ్మని విజయవాడ APSRTC బస్టాండ్ కు పంపాడాని శివకు తెలిసిన వ్యక్తి ఈ (16) కేజీల గంజాయిని వీరికి విజయవాడ బస్టాండ్ లో ఇస్తాడని. గంజాయిని తెచ్చి ఇచ్చినందుకు శివ వీరికి రూ. 5000/- చొప్పున ఇచ్చి శివ ఈ గంజాయిని ఒక్కో కేజీ 20 వేల రూపాయల చొప్పున మొత్తం రూ.3,20,000/- కు మధురై చుట్టుపక్కల ప్రాంతాలలో అమ్ముతారుని విచారణ తెలిపారని అధికారులు వెల్లడించారు.
ఈ కేసుతో సంబంధం ఉన్న అందరిని త్వరలోనే అరెస్టు చేస్తామని తెలపారు. ఈ కేసులో ప్రతిభ కనపరిచిన గూడూరు SEB టీం: (1)CI, P విజయ్ కుమార్, (2)SI. A శేషమ్మ, (3)HC M కిరణ్ సింగ్ | రమేష్ V.N ప్రసాద్ M.కృష్ణ, SK. భాష, TG ఆనందబాబు, రామ్ ప్రసాద్ ను ఉన్నత అధికారులు అభినందించారు.
Seb. సి ఐ. పి.విజయకుమార్ మీడియా కు తెలియజేస్తూ. పట్టణంలో అనేక అవగాహన కార్యక్రమాలు చేపట్టి ప్రజల్లో మరియు ముఖ్యంగా విద్యార్థుల్లో అవగాహన కల్పిస్తు కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నామని అలాగే పోస్టర్లు ఏర్పాటు మరియు పాంప్లెట్స్ పంచడం, కాలేజీలో డ్రగ్ అబ్యూస్ ప్రివెన్షన్ కమిటీల ఏర్పాటు, ర్యాలీలు వంటి అనేక కార్యక్రమాలను విస్తృతంగా చేపట్టడం జరుగిందని తెలపారు .నేర సమాచార సేకరణకై ప్రభుత్వం వారు ఏర్పాటుచేసిన టోల్ ఫ్రీ నెంబర్ 1400కు విస్తృత ప్రచారం కల్పిస్తున్నాము. గంజాయి వంటి డ్రగ్స్ కు సంబంధించిన సమాచారాన్ని ప్రజలు ఈ టోల్ ఫ్రీ నెంబర్ కు తెలియజేయవలిసింది గా సి .ఐ కోరెరు. సమాచారం తెలిపిన వాళ్ళ పేర్లు గోప్యంగా ఉంచుతామని తెలపారు.