Advertisements

చంద్రబాబుపై దోమలు పగబట్టాయ్, లోకేశ్ పేరు చిత్తు కాగితాల్లో కూడా రాయం- కొడాలి నాని ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

Kodali Nani On Chandrababu : టీడీపీ అధినేత చంద్రబాబు, నారా లోకేశ్ పై మాజీ మంత్రి కొడాలి నాని తనదైన శైలిలో సెటైర్లు వేశారు. జైల్లో ఉంటే దోమలు కుట్టక.. రంభ, ఊర్వశి, మేనకలు కన్ను కొడతారా అంటూ చంద్రబాబుపై సెటైర్లు వేశారు. జైలుకి వెళ్లిన ప్రతి ఒక్కరికీ బెయిల్ వస్తుందన్న ఆయన.. చంద్రబాబు ఏమన్నా ప్రియా పచ్చళ్ల కంపెనీలో ముక్కలు కొట్టడానికి వెళ్లాడా జైలుకి కాకుండా అని ఎద్దేవా చేశారు. జైలుకు వెళ్లిన ప్రతీ ఒక్కరికీ బెయిల్ వస్తుందని, బెయిల్ రానీవాళ్లు ఒక్కరు కూడా లేరన్నారు. లోకేశ్ మా పేర్లు రెడ్‌బుక్‌లో రాస్తున్నారని, మేము లోకేశ్ పేరు చిత్తు కాగితాల్లో కూడా రాయమన్నారు. ఎన్ని కేసులుంటే అంత పెద్ద పదవి వస్తుందన్న లోకేశ్.. ఇప్పుడు చంద్రబాబు జైలుకెళ్తే ఎందుకు ఏడుస్తున్నాడని ఎద్దేవా చేశారు. అయితే చంద్రబాబుకు పెత్త పదవి వద్దా అంటూ సెటైర్లు వేశారు. చంద్రబాబు అరెస్ట్‌తో లోకేశ్ జాతరలో తప్పిపోయిన పిల్లాడిలా బిత్తర చూపులు చూస్తున్నారన్నారు. జైలులో పెట్టండి అన్న లోకేశ్ ఇప్పుడు బెయిల్‌ కోసం కోర్టుల చుట్టూ ఎందుకు తిరుగుతున్నారని ప్రశ్నించారు.

Source link

Leave a Comment